అందరూ కలిసి ముంచుకుంటూ చంద్రబాబుపై ఏడ్పులు దేనికి?

Kavitha’s Allegations Deepen BRS Crisis and Rift

రాష్ట్ర విభజన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ జోలికి వెళ్ళలేదు. కానీ కేసీఆర్‌ మాత్రం అయనని గద్దె దింపే వరకు ఊరుకోలేదు. నేటికీ ఆయన పేరుతోనే బీఆర్ఎస్‌ పార్టీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుంటుంది. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని తెలంగాణలో రాజకీయాలు చేయడానికి బీఆర్ఎస్‌ పార్టీ ఏమాత్రం సిగ్గుపడటం లేదు.

చంద్రబాబు నాయుడుని, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే వారు, వారి పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కానీ బీఆర్ఎస్‌ పార్టీ, కల్వకుంట్ల కుటుంబమే ఇప్పుడు రోడ్డున పడింది కదా? అందుకే పెద్దలు ‘చెడపకురా చెడేవు..’ అని అన్నారు.

ADVERTISEMENT

కల్వకుంట్ల కవిత ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి హరీష్ రావు, సంతోష్ రావులే తమ పార్టీని చీడ పురుగుల్లా తొలిచేశారని, వారి కారణంగానే తమ పార్టీ, తమ ప్రభుత్వం ఈ దుస్థితికి చేరుకుందని కుండ బద్దలు కొట్టారు. కానీ తన తండ్రి కేసీఆర్‌ వారి చెప్పుడు మాటలు విని కూతురినైన తనను పార్టీ నుంచి మెడ పట్టుకొని బయటకు గెంటేశారని కవిత కన్నీళ్ళు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా వారిరువురూ తమ రాజకీయ ప్రత్యర్ధులతో చేతులు కలిపి తమ పార్టీని, తమ ప్రభుత్వాన్ని, తమ కుటుంబాన్ని ఏవిదంగా దెబ్బ తీశారో వివరించారు. కేసీఆర్‌ హయంలో కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో నేరెళ్ళలోని దళితులపై పోలీసుల దౌర్జన్యం గురించి గుర్తుచేసి ఆ పాడు పని చేసింది సంతోష్ రావు కాగా ఆ అప్రదిష్ట తన అన్న కేటీఆర్‌కి చుట్టుకుందన్నారు. అలాగే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు వందల కోట్లతో వెంచర్స్ ఎలా వేస్తున్నారని, అది అవినీతి సోమ్మే కదా? అని కవిత ప్రశ్నించారు.

కేసీఆర్‌ హయంలో ఎంత అవినీతి జరిగిందో, ఏవిదంగా జరిగేదో, దానికి ఎవరెవరు బాధ్యులో ఆమె పూస గుచ్చినట్లు ప్రెస్‌మీట్‌లో వివరించారు. అలాగే పార్టీలో కుట్రలు, కుతంత్రాల గురించి ఆమె వివరించారు.

ఒక పార్టీలో కీలక నేత బయటకు వస్తే ఇటువంటి రహస్యాలు ఎన్నో బయటపడుతుంటాయి. రాజకీయాలలో ఇది చాలా సహజం.

అయితే బీఆర్ఎస్‌ పార్టీకి మూల స్థంభం వంటి హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత చేసిన తాజా ఆరోపణలు, విమర్శలతో కేసీఆర్‌, కేటీఆర్‌ సైతం వారిని అనుమానించే పరిస్థితి కల్పించారు.

ఈ దెబ్బతో బీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలలో నిలువునా చీలితే అందుకు చంద్రబాబు నాయుడు లేదా రేవంత్ రెడ్డి లేదా ప్రధాని మోడీ కారణం కాదు కల్వకుంట్ల కవితే కదా?

పార్టీకి, పదవికి రాజీనామా చేస్తూ ‘జై కేసీఆర్‌’ అంటూ కల్వకుంట్ల కవిత నినాదం చేయడం కూడా రాజకీయమే కదా? తద్వారా బీఆర్ఎస్‌ పార్టీ హరీష్ రావుని వ్యతిరేకించేవారందరికీ ఆమె తెలంగాణ జాగృతిని ప్రత్యామ్నాయంగా ఉందని సంకేతం ఇస్తున్నట్లే భావించవచ్చు.

ఏపీ, తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి బీఆర్ఎస్‌ పార్టీని దెబ్బ తీయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఇప్పుడు కవిత చేస్తున్న దేమిటి?

కానీ బీఆర్ఎస్‌ పార్టీలో హరీష్, సంతోష్ రావు వంటి నేతలు, చివరికి పార్టీ నుంచి బయటపడిన కల్వకుంట్ల కవిత కూడా తమ పార్టీని, తండ్రి ప్రతిష్టని, అన్న కేటీఆర్‌ రాజకీయ జీవితాన్ని దెబ్బ తీస్తున్నారు కదా? పార్టీలో ఇన్ని లుకలుకలు, ఇంత మంది కుట్రదారులు, అవినీతి పరులను పెట్టుకొని ఆణిముత్యాలమని ఎలా చెప్పుకో గలుగుతారో?

ADVERTISEMENT
Latest Stories