కవితని అరెస్ట్ చేయగలిగారు కానీ అవినాష్ రెడ్డిని….

Kavitha-Kalvakuntla-YS Avinash Reddy

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోయారు. ఈ కుంభకోణం బయటపడి దాదాపు రెండేళ్ళు పైనే అవుతున్నా ఇంతవరకు ఆమెను అరెస్ట్ చేయలేకపోయారు…. అని అనేకంటే అరెస్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వమే వారికి బ్రేకులు వేసిందని చెప్పవచ్చు.

ADVERTISEMENT

ఇంతకాలం కల్వకుంట్ల కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు… ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు?అనే ప్రశ్నలకు సమాధానాలు సామాన్య ప్రజలకు సైతం తెలుసు. కనుక ఇప్పుడు ఆ చర్చ అనవసరం.

అయితే కల్వకుంట్ల కవిత అరెస్టుతో మరో కొత్త ప్రశ్న తలెత్తింది. ఓ మాజీ ముఖ్యమంత్రి, దేశ రాజకీయాలను సైతం శాశించగలరనుకున్న కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని, బిఆర్ఎస్ పార్టీకి అడ్డాగా భావించబడే హైదరాబాద్‌లోనే ఈడీ అధికారులు ధైర్యంగా అరెస్ట్ చేయగలిగినప్పుడు, వివేకా హత్య కేసులో వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కర్నూలు వెళ్ళిన సీబీఐ అధికారులు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు?

అక్కడ ఆయనకు రక్షణగా వైసీపి శ్రేణులు నిలబడ్డాయి కనుక వెనక్కు తిరిగివచ్చారని సరిపెట్టుకున్నా, అవినాష్ రెడ్డి విచారణ కోసం హైదరాబాద్‌లో తమ కార్యాలయానికి వచ్చిపోతున్నప్పుడైనా సీబీఐ అధికారులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఆయనను సీబీఐ అరెస్ట్ చేయకుండా కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి ఎవరు?ఎందుకు కాపాడుతోంది? అనే ధర్మ సందేహాలకు వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి నిన్ననే సమాధానాలు చెప్పారు! వివేకా హత్యకు ఆవినాష్ రెడ్డినే వారిద్దరూ వేలెత్తి చూపిస్తున్నారు.

కేవలం మూడు నాలుగు వందల కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాని, ఇప్పుడు కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితని, నేడో రేపో ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ని కూడా అరెస్ట్ చేస్తున్నప్పుడు, లక్షల కోట్ల అక్రమాస్తుల కేసులలో నిందితులు ఏపీలో రాజ్యమేలుతుండటం చాలా విచిత్రమే కదా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులను ఈడీ అరెస్ట్ చేసింది మరి వివేకా హంతకులను సీబీఐ ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది?అంటే బహుశః ఆమె తర్వాత ఆయన వంతే కావచ్చునని రాష్ట్రంలో ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories