Kavitha Sharmila

తెలంగాణలోని బిఆర్ఎస్ ఫోన్ టాపింగ్ కేసు విచారణలో అనేక సంచనాలు బయటకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ ఫోన్ టాపింగ్ ఆరోపణలు కేవలం తెలంగాణ రాజకీయాలకు, సినీ పరిశ్రమ సెలబ్రెటీల జీవితాలకు మాత్రమే పరిమితమయ్యాయి అనుకున్న వారికీ ఇప్పుడు తాజాగా వీటి మూలాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా తాకాయి అని తెలిసొచ్చింది.

టి. వైసీపీ పేరుతో తెలంగాణలో రాజకీయం మొదలు పెట్టిన షర్మిల ఒక్కసారిగా తన పార్టీని సైలెంట్ గా కాంగ్రెస్ లో విలీనం చేసి, వైలెంట్ గా ఏపీలోని వైసీపీ పై ఎందుకు విరుచుకుపడిందా అనుకున్న వారి అనుమానాలకు, అపోహలకు నేడు బదులు దొరికింది.

Also Read – భారత్‌కు శాపంగా మారిన అమెరికా, చైనా?

నాడు వైసీపీ ఆప్త బంధువు, వైస్ జగన్ అజ్ఞాత స్నేహితుడు అయిన బిఆర్ఎస్ జగన్ కు మేలు చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన సోదరి షర్మిల ఫోన్ ను టాప్ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి.
అయితే అన్న వదిలిన బాణంలా నాడు వైసీపీ గెలుపులో వైస్ జగన్ విజయం లో కీలక పాత్ర పోషించిన షర్మిల పై జగన్ చేస్తున్న ఈ తెరచాటు రాజకీయానికి ప్రతీకారంగానే నేడు షర్మిల ఏపీ రాజకీయాలలోకి అడుగు పెట్టి వైసీపీ పతనానికి పోరాటం మొదలుపెట్టి ఉండవచ్చు.

వైసీపీ దుర్మార్గానికి, బిఆర్ఎస్ దుశ్చర్యకు వైఎస్ షర్మిల రాజకీయ జీవితం చుక్కాని లేని నావలా తయారయ్యింది. చివరికి వైసీపీ, బిఆర్ఎస్ ల జగన్నాటకంలో తానూ ఒక బాధితురాలిగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఈ ఫోన్ టాపింగ్ బాధితుల ఖాతాలో బయటకొచ్చిన మరో పేరు బిఆర్ఎస్ పార్టీలోనే కాదు తెలంగాణ రాజకీయాలలో కూడా పెను సంచలనంగా మారనుంది.

Also Read – వైసీపీ చీకటి మెయిల్స్…

ఇన్నాళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం తన ప్రత్యర్థి పార్టీ నాయకులను రాజకీయంగా టార్గెట్ చేయడానికో, వారిని అణిచివేయడానికో వారి ఫోన్లను మాత్రమే టాప్ చేసింది అనుకుంటే ఇప్పుడు బయటకు వస్తున్న కొన్ని పేర్లతో ఈ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించిన దాని కంటే, ప్రజలు భావించిన దానికంటే చాల పెద్ద ఎత్తునే జరిగింది అన్న అభిప్రాయం కలుగుతుంది.

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ చెల్లి కవిత, ఆమె సన్నిహితుల ఫోన్లు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టాపింగ్ కు గురయ్యాయంటూ వస్తున్న వార్తలు బిఆర్ఎస్ నాయకులను కూడా భయాందోళనలోకి నెడుతున్నాయి.

Also Read – అసెంబ్లీ వద్దు మీడియానే ముద్దా.?

స్వయానా నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె గా ఉన్న కవిత ఫోన్ కూడా సొంత పార్టీ నేతల చేత టాపింగ్ చేయబడింది అంటే ఇక్కడ కవిత పై సొంత వారే నిఘా పెట్టారా.? ఆమె కథలికల పై ఆరా తీసారా.? అన్న ప్రశ్నలు ఎదురవుతుంది.

కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి బెయిలు మీద బయటకు వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ పార్టీ రాజకీయానికి దూరంగా ఉంటూ తన సొంత పంథాలో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్ వరకు, అలాగే తన అన్న కేటీఆర్ దగ్గర మొదలు పెడితే తన మామ హరీష్ రావు వరకు కవిత వారి పై ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేస్తూ బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా జాగృతి బలోపేతానికి నడుం బిగించింది.

అయితే నాడు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు, బిఆర్ఎస్, బీజేపీలో విలీనానికి రంగ సిద్దమవుతుంది అంటూ చేసిన ఆరోపణలు, హరీష్ బీజేపీ కోవర్ట్ అంటూ చేసిన పరోక్ష విమర్శలతో కవిత పై ఇంటా బయటా తీవ్ర వ్యతిరేక వ్యక్తమయింది. తండ్రిని కాదని, అన్నకు వ్యతిరేకంగా కవిత చేస్తున్న రాజకీయం పై విమర్శలు మొదలయ్యాయి.




అయితే తాజగా వెలుగులోకి వస్తున్న వాస్తవాలు చూస్తుంటే కవిత కూడా షర్మిల మాదిరే తన సొంత కుటుంబ సభ్యుల చేతిలోనే మోసపోయిందా.? రాజకీయంగా అణిచివేయబడిందా.? అందుకే కవిత తన సొంత కుటుంబ సభ్యులతోనే అంతర్గత పోరుకు సిద్ధమయ్యిందా.? కవిత, షర్మిల ఇద్దరిది అన్న ల రాజకీయ భవిష్యత్ కోసం రాజకీయంగా బలైపోయిన చేల్లిల్ల కథేనా.? అంటూ ఈ కేసు చుట్టూ అనేక అంతుచిక్కని ప్రశ్నలెన్నో సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి.