కేసీఆర్ తన అసమర్ధతను చంద్రబాబు మీద తోసేస్తున్నారా?

KCR blaming Chandrababu Naidu on Inter results controversyతెలంగాణాలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల ఎంతో మంది పిల్లలు, వారి తల్లితండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతున్నారు. మొదట్లో తనదైన శైలిలో ఫార్మ్ హౌస్ లోనే ఉండిపోయి విషయం దానంతట అదే సమసిపోతుంది అని సైలెంట్ గా ఉన్నారు. చివరకు పరిస్థితి చెయ్యి దాటి పోవడంతో ఆయన నష్ట నివారణా చర్యలు చేపట్టారు. ఫెయిల్ అయిన అందరి విద్యార్థులకు రివాల్యుయేషన్, రికౌంటింగు ఫ్రీగా చెయ్యాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇది ఇలా ఉండగా దీనిలో కూడా చంద్రబాబు హస్తం ఉందని అనుమానిస్తున్నారు కేసీఆర్. “ఆంధ్ర యాజమాన్యం గల కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు బోర్డులోని కొందరి ఉద్యోగులను కొనేసి మన ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలని ఇటువంటి చర్యలకు ఉపక్రమించి ఉండవచ్చు,” అని కేసీఆర్ సమీక్ష సమావేశంలో చెప్పినట్టు సమాచారం. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు దీనికి తెగబడ్డారని కేసీఆర్ అనుమానం.

ADVERTISEMENT

అయితే దీనిపై తెలుగుదేశం అభిమానులు విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ తన అసమర్ధతను చంద్రబాబు మీద తోసేస్తున్నారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇంటర్‌ విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఫీజు చెల్లించిన వారికి తిరిగి ఇచ్చేస్తామని జనార్దన్‌రెడ్డి స్ఫష్టం చేశారు. వివిధ జాతీయ స్థాయి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే వారికీ ఇబ్బంది కలగకుండా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ముందుకు జరుపుతామని ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories