అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు కేసీఆర్‌ ఒకటే చెప్పారు కానీ

KCR-Chandrababu-Naidu

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, పదేపదే కేంద్రానికి ఓ వినతి చేస్తుండేవారు. ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగి వాటితో పోటీ పడే స్థాయికి ఎదిగేందుకు (లెవెల్ ప్లేయింగ్) తోడ్పడాలని కోరుతుండేవారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.

ఇప్పుడు వైసీపి నాలుగున్నరేళ్ళ పాలనలో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు నాయుడు వాదనలను తేలికగా కొట్టిపడేయలేము. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో నంబర్:1 స్థానానికి చేరుకొంటే, జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాలలో పూర్తిగా వెనకబడిపోయింది. ఎంతగా అనే ఇప్పుడు బిహార్‌తో సహా అన్ని రాష్ట్రాలు తమ ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ దుస్థితిని ఉదాహరణగా చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇంతకంటే అవమామానం, దౌర్భాగ్యం ఏముంటుంది?

ADVERTISEMENT

ఎన్నికల సమయంలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు తదితరుల మాటలే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న బిఆర్ఎస్‌ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ కూడా అమరావతిలా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలా తయారవుతుందని బిఆర్ఎస్ నేతలు తమ ప్రజలకు పదేపదే చెప్పారు.

ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఇదేవిదంగా ఆంధ్రా ప్రజలను పదేపదే హెచ్చరించారు. కానీ అప్పుడు ఆంధ్రా ప్రజలు, ఇప్పుడు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొన్నారు. ఆ మార్పు ఎంత భీభత్సంగా ఉంటుందో ఆంధ్రా ప్రజలకు పూర్తిగా అర్దమయ్యే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజల వంతు అనుకోవాలేమో?కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాతో ‘లెవెల్ ప్లేయింగ్’ స్థాయికి తీసుకువస్తారా? లేక కేసీఆర్‌ కంటే గొప్పగా అభివృద్ధి చేసి చూపిస్తారో?

ADVERTISEMENT
Latest Stories