చంద్రబాబు ఐడియాను కాపీ చేస్తున్న కేసీఆర్

KCR - Chandrababu - Naidu-తెరాస మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులు, సూచనలపై ఈ కమిటీలో నేతలు చర్చించనున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టిన నిరుద్యోగ భృతి వంటి దానిని తమ మేనిఫెస్టో లో కూడా పెట్టాలని తెరాస భావిస్తోందట.

ADVERTISEMENT

[m9ad]

నిరుద్యోగ యువత లో నిరాశ ఎక్కువ ఉన్న తరుణంలో వీలైనన్ని ఉద్యోగాలు… కుదరని వారికి నిరుద్యోగ భృతి ఇచ్చే అవకాశాన్ని తెరాస పరిశీలిస్తుంది. కేకే నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ గత నెల రోజులుగా మేనిఫెస్టో రూపకల్పనపై తీవ్ర కసరత్తు చేసింది. దాంట్లోని కీలకాంశాలను స్వయంగా కేసీఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటుచేసి వెల్లడించనున్నట్టు సమాచారం.

గత నాలుగేళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు వాటిలో కొన్ని మార్పులు చేయాలని తెరాస భావిస్తోంది. పెన్షన్లను కొంత మేరకు పెంచాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.. అయితే, ఎంత మేరకు పెంచుతారనే అంశంపై ఈ రోజు క్లారిటీ రానుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెరాస మరొక అడుగు ముందుకు వేసినట్టే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories