నిజామాబాదు నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోవడం తెలంగాణ రాజకీయాలలో పెను సంచలనమే అనుకోవాలి. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి మందీమార్బలం ఉండి ఇటువంటి ఎన్నికలలో గణనీయమైన అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇవేమి కవిత ను కాపాడలేకపోయాయి. కారణం స్వయంకృతాపరాధమే. కవిత పై గెలిచింది రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్ కుమారుడు అరవింద్. 2004 ఎన్నికల కాంగ్రెస్ గెలుపులో డిఎస్ పాత్ర కీలకం.
కాంగ్రెస్ లో అప్పట్లో ప్రతీ నాయకుడూ ముఖ్యమంత్రి అభ్యర్ధే. వారిని ఒక తాటి మీదకు తేవడంలో డిఎస్ పాత్ర కీలకం. అప్పట్లో కాంగ్రెస్ తెరాస పొత్తుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ససేమిరా అన్నారు. అయితే డిఎస్ ఒప్పుకోకుండా హై కమాండ్ ను ఒప్పించారు. ఆ పొత్తు అప్పట్లో సూపర్ హిట్. ఈరోజు తెరాస ఇలా ఉండటానికి ఆ పొత్తు కూడా కారణమే. 2014 ఎన్నికల తరువాత డిఎస్ తెరాసలో చేరారు. రాజ్యసభ ఎంపీను చేసినా ఆయనకు పార్టీలో సరైన గుర్తింపు లేదు.
రాజకీయాలలో డిఎస్ కంటే జూనియరైనా కవిత ఆయన మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ మిన్నకుండిపోయారు. దీనితో డిఎస్ ను తప్పించారు. ఆయన కొడుకుతో పని చేసి బీజేపీ కాంగ్రెస్ లను ఇక్కడ సమన్వయం చేసి గెలిపించున్నారు. నిజామాబాదులో కాంగ్రెస్ బీజేపీకి లోపాయకారిగా పని చేసింది. తన ఓట్లను కూడా అరవింద్ కు బదిలీ చేసింది. దీనితో మోడీ ఫ్యాక్టర్, పల్లెలలో బీజేపీ క్యాడర్ పనితనం, కేసీఆర్ మీద వ్యతిరేకత అన్నీ పని చేసి కవితను ఇంటికి పంపాయి.



