కేసీఆర్..కవితకు నో ఎంట్రీ బోర్డు పెట్టారా.?

kcr-kavitha

కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత అంటూ నిన్న రాత్రి ఆయనను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో కేసీఆర్ తో పాటుగా ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ఉన్నారు.

ADVERTISEMENT

అయితే కేసీఆర్ ఆరోగ్యం పై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, కేవలం జనరల్ చెక్ అప్స్ కోసమే ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని, వైద్యుల సూచనలతోనే అడ్మిట్ చేశామంటూ కేటీఆర్ పార్టీ శ్రేణులకు తెలియచేసారు.

ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ను కలిసేందుకు అనేకమంది బిఆర్ఎస్ నాయకులు యశోదకు చేరుకొని కేసీఆర్ ను పరామర్శించారు. అయితే ఇక్కడ ఎక్కడ కూడా కవిత కానీ కవిత కుటుంబీకులు కానీ కనిపించకపోవడంతో మరోసారి కల్వకుంట్ల ఇంటి విభేదాలు చర్చకొస్తున్నాయి.

మొన్నీమధ్య కవిత బిఆర్ఎస్ కు వ్యతిరేక మీడియాగా చెప్పబడే టీవీ 5 కి ఇంటర్ వ్యూ ఇవ్వడం, అందులో తనకు కేటీఆర్ కు మధ్య ఉన్న విభేదాల గురించి ప్రస్తావించడం, బిఆర్ఎస్ నాయకత్వ మార్పు మీద స్పందించడం ఇలా కవిత ఎత్తుకున్న ప్రతి అంశం బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండడంతో కేసీఆర్ పరామర్శ లో కవిత కి బిఆర్ఎస్ నో ఎంట్రీ బోర్డు పెట్టిందా అన్న చర్చ జరుగుతుంది.

కవిత వేస్తున్న అడుగులు, కేటీఆర్ పాటిస్తున్న మౌనం కేసీఆర్ కుటుంబ రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. ఒక పక్క పార్టీ ఓటమి, మరోపక్క కుటుంబంలోని అంతర్గత విభేదాలు కలిసి కేసీఆర్ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నాయా.?

బిఆర్ఎస్ నాయకత్వ మార్పే ఈ విభేదాలన్నిటికి మూలకారణమా.? ఇందులో కేసీఆర్ కొడుకు కేటీఆర్, కూతురు కవిత మధ్య నలిగిపోతున్నారా.? బిఆర్ఎస్ పార్టీలోని నాయకులకు ఉన్న ప్రాధాన్యత కేసీఆర్ కుమార్తె కవితకు దక్కలేదా.? అనే ఎన్నో ప్రశ్నలు తెలంగాణ రాజకీయ వర్గాలలో నడుస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories