కాళేశ్వరం కేసీఆర్ కొంప ముంచనుందా?

KCR Kaleshwaram Lift Irrigation Project Corruption

తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుని ప్రభావితం చేసింది. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రంలో సాగు నీటికి, తాగు నీటికి తమ పార్టీ ఎంత చిత్తశుద్దిగా పనిచేస్తుందో ప్రజలే గమనించాలి అంటూ గత ఎన్నికలలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకున్నారు.

ADVERTISEMENT

ఇప్పుడు అదే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో బయటపడిన లోపాలను ప్రతిపక్ష పార్టీలు అందుకుని అధికార బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అతికీలకమైన మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిన నేపథ్యంలో అటు కేంద్ర జలశక్తి స్పందించడంతో ఇక రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం పై పోరాడడానికి తమకొక బలమైన అస్త్రం దొరికింది అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.

మేడిగడ్డ బ్యారేజీని ఆరుగురు సభ్యుల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించనున్నట్లు కేంద్ర జలశక్తి అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణసంస్థతో పాటు రాష్ట్ర ఇరిగేషన్ శాఖతో, ప్రభుత్వ అధికారులతో చర్చించి ఆ నివేదికని కేంద్ర జలశక్తి శాఖకు అందించనున్నారు. ప్రాజెక్టులో ఏర్పడిన లోపాలను సందర్శించడానికి కూడా లేకుండా ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేస్తుందంటూ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై విమర్శలకు దిగుతున్నారు.

బంగారు తెలంగాణ అంటే ఇదేనా కేసీఆర్ అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్షాల ఎన్నికల ప్రచారానికి కాళేశ్వరం ఇప్పుడు ఒక ఆవుయు పట్టుగా మారింది. నాణ్యత లేని ప్రాజెక్టులతో ప్రజలను నిండాముంచి కేసీఆర్ తన కుటుంబానికి మాత్రం బంగారుబాట వేసుకున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.ఎన్నికల వేళ కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లు ఉంటుంది రాష్ట్రంలో వాతావరణం అలాంటిది తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడితే ఇక రాష్ట్రంలో విపక్షాల ఎన్నికల ప్రచార వేడిని తట్టుకోవడం ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనేనా!

గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గట్టెక్కించిన కాళేశ్వరం మరి ఈ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీని గట్టెక్కిస్తుందో, ఏ రాజకీయ పార్టీని తన ప్రవాహంలో కలిపేసుకుంటుందో వేచి చూడాలి.

ADVERTISEMENT
Latest Stories