కేసీఆర్ చేసిన పని బాబు చేసుంటే?

KCR-Chandrababu-Naidu

రాజకీయాలలో గెలుపోటములు సహజం.గెలిచినంత మాత్రమేనా అహంకారంతో ప్రతిపక్ష పార్టీలను దూషించనుకూడదు, అలాగే ఓడినంత మాత్రానా ప్రజలకు ముఖం చాటెయ్యనుకూడదు. తాజాగా విడుదలైన తెలంగాణ ఎన్నికల ఫలితాలలో బిఆర్ఎస్ ఓటమి తరువాత పదేళ్లు అధికారం ఇచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలకు కనీస గౌరవం ఇవ్వలేదు అనే విమర్శను కేసీఆర్ మూటకట్టుకున్నారు.

తమ పార్టీకి అధికారం ఇస్తేనే కేసీఆర్ కు ప్రజలు గుర్తువస్తారని, అదే ప్రజలు పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెడితే మాత్రం మొఖం చాటేస్తారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఎంతటి చరిత్ర కలిగిన పార్టీ అయినా, ఎంత గొప్ప నాయకుడైన ప్రజా స్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పుకి బంది అయ్యి ఉండాల్సిందే అనేది చరిత్ర చెప్పిన పాఠం.

ADVERTISEMENT

తెలంగాణలో ఊహించని ఫలితాలతో కంగు తిన్న కేసీఆర్ పార్టీ ఓటమి తరువాత తన వంతు బాధ్యతగా ఇంతకాలం తనను, తన పార్టీని ఆదరించిన ప్రజల ముందుకొచ్చి తన స్పందన తెలియ చేసి ప్రజలిచ్చిన తీర్పుతో ఏర్పడబోతున్న కొత్త ప్రభుత్వానికి తన అభినందనలు తెలియచేస్తే పదేళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా హుందాగా ఉండేది. కానీ అదేమీ చెయ్యలేదు కేసీఆర్.

ఓటమిని ఊహించే కేసీఆర్ మీడియా ముందుకు కూడా రాలేకపోతున్నారు అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ఇప్పుడు నిజం చేస్తున్నట్లుంది. పదవిలో ఉంటే పార్టీ పెద్దగా, రాష్ట్రానికి దిక్కుగా వచ్చి ప్రతిపక్షాలు మీద వెటకారాలు, పక్క రాష్ట్ర రాజకీయ పార్టీలకు రిటర్న్ గిఫ్టులు ఇచ్చే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను తీసుకోలేక ముఖం చాటేస్తూ కుమారుడిని అడ్డుపెట్టుకున్నారు అనే అపవాద తెచ్చుకున్నారు.

సొంత రాష్ట్ర ప్రజలు ఇచ్చిన రిటర్న్ గిఫ్టుకే కేసీఆర్ ఇంతలా ఆవేదన చెందితే కుట్ర రాజకీయాలతో, తెర చాటు రాజకీయం చేసి వ్యూహాత్మకంగా దెబ్బకొట్టి ఏపీలో టీడీపీ పార్టీ ఓటమికి కారణమైన తెరాస పార్టీ ఎత్తుగడలకు అప్పటి చంద్రబాబు ఓటమి ఒక కారణంగా నిలిచింది.అయినా బాబు ప్రజలిచ్చిన ఓటమిని కూడా గౌరవించి, ప్రజలెంచుకున్న నూతన ప్రభుత్వానికి వైస్ జగన్ మోహన్ రెడ్డి కి తన అభినందనలు తెలియ చేశారు.

బాబు కూడా కేసీఆర్ మాదిరి పార్టీ ఓటమి చెందగానే ముఖం చాటేస్తే అధికారం లేకపోతే చంద్రబాబుకి ప్రజలతో సంబంధం ఉండదు,ప్రజలిచ్చిన తీర్పుని బాబు గౌరవించలేకపోతున్నారు అంటూ వార్తలు ప్రచారం చేసే బ్లూ మీడియా,ప్రత్యర్థి పార్టీ నేతలు ఇప్పుడు “నోరు మెదపడం లేదు,పెన్ను కదపడం లేదు”.కానీ వారందరికీ అటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీ గా తన వంతు బాధ్యతగా ప్రభుత్వం పైన పోరాడడానికి తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అనే భరోసాను ప్రజలకు అందించారు బాబు.

రాజకీయాలలో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సింది ఇదే. వ్యక్తిగత భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని గెలుపుని ఓటమిని ఇకేరకంగా తీసుకుని ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అపుడే ప్రజలు మరోసారి ఆ పార్టీ పైన నమ్మకాన్ని పెట్టగలరు. అయితే బిఆర్ఎస్ పార్టీ తరుపున కేటీఆర్ ఆ పని చేసినప్పటికీ కేసీఆర్ మోనంగా ఉండడంతో విమర్శల మోతాదు పెరుగుతుంది. కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసినట్టు ‘దొర’ ఓటమిని ఒప్పు కోలేకపోతున్నారేమో మరి.

ADVERTISEMENT
Latest Stories