జాతీయ రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే కేసీఆర్ ఇది తెలుసుకోవాలి

దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు తీసుకరావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మే మొదటి వారంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశం కానున్నారని. ప్రస్థుతం ఒరిస్సాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మే మొదటి వారంలో భువనేశ్వర్ రావలసిందిగా నవీన్ పట్నాయక్ సిఎం కేసీఆర్ ను ఆహ్వానించారని తెరాస తన అధికార ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది.

ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇదే విషయాన్ని అన్ని మీడియా చానెళ్లకు పంపడంతో అన్ని ఛానెళ్లలో ప్రముఖంగా వచ్చింది. అయితే ఈ వార్తలను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తోసి పుచ్చారు. పూరిని సందర్శించుకోవడానికి ఆయన వస్తున్నారని మర్యాదపూర్వకంగానే తనను కలవాలని కోరారని ఆయన మీడియాకు చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

పైగా ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడే ఉద్దేశమేది లేదని కూడా చెప్పారు. గతంలో కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రకటించగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేసి అభినందించి సై అన్నారని సీఎం ఆఫీసు వర్గాలు ఉప్పందించాయి. అయితే బెంగాల్ మీడియా వెంటనే ఖండించి కేసీఆరే మమతకు ఫోన్ చేసారని రాశాయి.

తరువాత కేసీఆర్ వెళ్లి ఆమెను కలిసి ఫ్రంట్ గురించి చర్చించినా దాని గురించి మమత మీడియాతో ఏమి మాట్లాడకపోవడం గమనార్హం. జాతీయ స్థాయి నాయకులతో వ్యవహారం ఉన్నప్పుడు ఇలా వారిని తన సొంత పబ్లిసిటీకి వాడుకునే ప్రయత్నం చేస్తే మొత్తానికి బెడిసికొట్టే అవకాశం ఉంది. ఈ విషయం కేసీఆర్ తెలుసుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories