ప్రజలు తిరస్కరించినా పదవులు పదిలమేనా కేసీఆర్ గారు

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణం మనకు పూర్తి అనుకూలంగా ఉందని, 100 స్థానాల్లో గెలుపు ఖాయమని ఢంకా బజాయించారు. రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల మేరకు పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

[m9ad]

ADVERTISEMENT

సెప్టెంబరు చివరి వారం లేదా అక్టోబరు మొదటి వారంలో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. నలుగురైదుగురు మినహా సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని చెప్పారు. టికెట్లు రాని సిట్టింగ్‌లను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని, ఎమ్మెల్సీలుగా లేదా ఇతర అవకాశాలు కల్పిస్తామని, వారితో చర్చించాకే అక్కడి అభ్యర్థులను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు.

అంటే పనితీరు బాలేదని ప్రజలు తిరస్కరించినా వారి పదవులు పదిలమేనా? ఇలా మాటలాడటం ద్వారా కేసీఆర్ ప్రజాప్రతినిధులకు ఏం సందేశం ఇస్తున్నట్టు? రాజకీయమంటే గెలుపు ఓటమి, సీట్లు పదవులేనా? సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇలా ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలలో బాధ్యత, జవాబుదారీతనం ఎక్కడ ఉంటుంది?

ADVERTISEMENT
Latest Stories