ఒకప్పుడు కేసీఆర్ లగడపాటి రాజగోపాల్ ఉప్పు నిప్పు మాదిరిగా ఉండేవాడు. అయితే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగా వారిద్దరూ కలిసిపోయారట. పైగా కేసీఆర్ కోసం లగడపాటి ఇటీవలే ఒక సర్వే కూడా చేసి పెట్టారట. ఆ సర్వే ఫలితం బట్టే కేసీఆర్ ముందస్తుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారట.
[m9ad]
పార్లమెంట్ కు అసెంబ్లీకు రెండు ఎన్నికలు ఒకేసారి వస్తే జాతీయ సమస్యలు ప్రధానంగా తెరపైకి వచ్చి టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగే పరిస్థితి ఉన్నదని తేలిందని సమాచారం. ఆ నష్టం జరగకుండా చూసుకోవడానికే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
అయితే ఇంకొక విషయం ఏంటంటే… ఆ సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 50 శాతం వరకు సానుకూలత వ్యక్తమయింది. ఎమ్మెల్యేలపై మాత్రం ప్రతికూల అభిప్రాయాలు ప్రజల్లో బలంగా వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యేలెవరికి కూడా 20 నుంచి 30 శాతం మార్కులు రాలేదని సర్వేలు తెలిపాయి. దీనితో వేసే ప్రతి ఓటు కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చెయ్యడానికే అనే నినాదాన్ని ఎత్తుకున్నారు తెరాస వారు.



