తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజవర్గం నుంచి మరో సారి గెలిస్తే, గత మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గానికి ఉన్న చరిత్రను తిరగరాసిన వారు అవుతారు. ఈ నియోజకవర్గంలో 1983 నుంచి వరసగా ఏ ఒక్క నేత గెలవలేదు. ఒకసారి గెలిచినవారు ,ఆ తర్వాత ఎన్నికలలో ఓడిపోతూ వచ్చారు.
[m9ad]
1983 లో సాయిలు అనే నేత గెలిస్తే 1985 లో బి.సంజీవరావు విజయం సాదించారు. తదుపరి 1989 లో గీతారెడ్డి , 1994 లో విజయరామారావు, 1999లో సంజీవరావు,2004 లో గీతారెడ్డి గెలిచారు. 2009 లో టి.నరసారెడ్డి గెలిచారు.2014 ఎన్నికల నాటికి ఆయన తెరాస లో చేరిపోయారు. 2014 లో గజ్వేల్ లో కెసిఆర్ గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.
మరోసారి ఆయన పోటీచేసి విజయం సాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గజ్వేలు విషయంలో మరో సెంటిమెంటు కూడా ఉంది. అక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనేఅధికారంలోకి వచ్చింది.కాగా కేసీఆర్ ను ఎదుర్కోవడానికి మహాకూటమి ఒక అభ్యర్దిని రంగంలో దింపే ప్రయత్నం చేస్తోంది. 2014లో కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చిన వంటేరు ప్రతాప్ రెడ్డి మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది.




