పార్లమెంట్ లో కుప్పకూలిన మాజీ మంత్రి పరిస్థితి విషమం!

Kerala MP E Ahamed suffers heart attackపార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంగళవారం నాడు ఉదయం రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ ముఖర్జీ ప్రసంగిస్తోన్న స‌మ‌యంలో కేరళకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఇ.అహ్మద్‌ అస్వ‌స్థ‌త‌కు గురై అక్క‌డే కుప్ప‌కూలిపోయారు. తాజాగా ఆయ‌న ప‌రిస్థితిపై వైద్యులు వివ‌రాలు వెల్లడించారు. అహ్మద్ కు గుండెపోటు వ‌చ్చింద‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న పరిస్థితి విషమంగా ఉందని మీడియాకు తెలిపారు.

వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామ‌ని, ఆసుప‌త్రికి తీసుకొచ్చిన‌ప్పుడు హృదయ స్పందన, పల్స్‌ పడిపోయాయని, ఆయ‌న‌కు వెంటనే చికిత్స ప్రారంభించి తిరిగి గుండె కొట్టుకునేలా చేయగలిగామని పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగానే ఉంద‌ని, ఆయన ఆరోగ్య ప‌రిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories