పవన్‌ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం

kesineni nani says Pawan Kalyan will not win electionsజనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలకు తెలుగు దేశం నేతలు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. పవన్‌ కల్యాణ్ ఎ‍క్కడ పోటీ చేసినా ఓడిపోతాడని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విలేకరులతో నాని మాట్లాడుతూ..వాళ్ల అన్నయ్య చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 సీట్లు మాత్రమే గెలిచారనే విషయాన్ని గుర్తు చేశారు.

ADVERTISEMENT

[m9ad]

పవన్‌ కల్యాణ్ ఒక యాక్టర్‌, అతన్ని చూడటానికి మాత్రమే ప్రజలు వస్తారు..అంతే కానీ వాపును చూసి బలుపు అనుకోకూడదని హితవు పలికారు. పవన్‌ కల్యాణ్‌ తన బలం, బలహీనత తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో జనసేనకు తెలుగుదేశంకు మధ్య స్నేహ సంబంధాలు ఉన్నప్పుడూ పవన్ కేశినేని నాని మీద ఘాటు విమర్శలు చేసేవారు.

అప్పట్లో ప్రజారాజ్యంలో ఉన్న నాని ఎన్నికల ముందు ఆ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చారు. దానితో ఆయనపై పవన్ కు పీకల దాకా కోపం ఉన్నట్టు గతంలో చాలా సార్లు కనిపించారు. పవన్ బీజేపీని వదిలేసి తెలుగుదేశంను మాత్రమే టార్గెట్ చేస్తుండడంతో ఆ పార్టీ నేతలకు చంద్రబాబు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories