జగన్… మనిషై పుట్టాక అంతో ఇంతో చేయాలి!

kethi reddy pedda reddy comments on  jaganరెండున్నర్రేళ్ళ వరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఒక్క కామెంట్ చేయడానికి కూడా ఎవరూ సాహాసించలేదన్న విషయం బహిరంగమే. కానీ ఇటీవల ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ మొదలుకుని ప్రారంభమైన విమర్శల వర్షం, నేడు సొంత పార్టీ వర్గాలే జగన్ పై నిప్పులు చెరిగే వరకు చేరుకుంది.

ADVERTISEMENT

పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయంటూ పలు మీడియా వర్గాలు ప్రసారం చేసిన కధనాలకు ఇప్పుడు ప్రాధాన్యత లభిస్తోంది. తాజా ఎపిసోడ్ లో తాడిపత్రి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వయంగా జగన్ పై విరుచుకుపడడ్డారు.

“ఇన్ని అబద్ధాలు చెప్తూ, ఇంత మోసం చేస్తూ బతుకుతూ ఉంటే మానవ జన్మకు కూడా మంచిది కాదనేది తన ఆలోచన”గా తెలిపారు పెద్దారెడ్డి. “మానవుడై పుట్టినాక ఎవరికో ఇంతో సేవ అయినా చేయాలా లేకపోతే మనకు సేవ చేసే గుణం లేకపోతే మన పరిధిలో అయినా మనం ఉండాలా!” అంటూ జగన్ తీరును విమర్శించారు.

“అందరికి కూడా నిత్యం అబద్ధాలతోనూ, అతని రాజకీయ లబ్ది కోసం ఏం మాట్లాడతారో అతనికే తెలియని పరిస్థితిలో ఉన్నారు, బుద్ధి చెప్పండి” అన్న తాడిపత్రి ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి. ప్రత్యర్థి పార్టీ నేతలు మాట్లాడితే రాజకీయాలని తోసిపాడేయం సహజం, మరి సొంత పార్టీ నేతలే విడమరిచి చెప్పడాన్ని ఏమంటారు?!

ఇటీవల పార్లమెంట్ లో కూడా వైసీపీ వ్యతిరేకంగా ఓ ఎంపీ తన స్వరాన్ని వినిపించిన విషయం తెలిసిందే. ఇలా ఒకరు తర్వాత మరొకరు పెదవి విప్పుతుంటే, ఈ కోవలోనే మరికొంత మంది నేతలు క్యూ కట్టనున్నారా? విమర్శల ఉధృతి మరింతగా పెరగనుందా? ఎమ్మెల్యేలు చేయి దాటిపోయే స్థాయిలో జగన్ పాలన ఉంటోందా? ఈ ప్రశ్నలకు సొంత పార్టీ నేతలే భవిష్యత్తులో సమాధానం ఇస్తారేమో!?

https://twitter.com/ma_prathi/status/1468900935833370633

ADVERTISEMENT
Latest Stories