ఏది ఏమైనా విజయవాడకే ఫిక్స్ అయిన “ఖైదీ నంబర్ 150”

khaidi-no-150-audio-launch-vijayawada-indira-gandhi-stadiumడిసెంబర్ 25వ తేదీ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం, సాయంత్రం ఆరు గంటల నుండి మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సినిమా ఆడియో వేడుక జరగాల్సి ఉంది. అయితే స్టేడియంలో అనుమతి ఇవ్వకపోవడంతో, మరో వేదిక కోసం మెగా కాంపౌండ్ అన్వేషణ చేసినప్పటికీ, అది కార్యరూపం దాల్చకపోవడంతో, ఏకంగా ఆడియో వేడుకనే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో మెగా అభిమానులు నిరుత్సాహంలో మునిగితేలారు.

ఇంతలోనే మరో వార్త. ఆడియో వేడుక లేనప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నామని తెలియడంతో మళ్ళీ కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే ఇదిగో అదిగో అంటూ వచ్చిన వార్తలలో స్పష్టత లేకపోవడంతో… ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పుడు, ఎక్కడ జరుపుతారు? అన్న దానిపై మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది. అయితే తాజా సమాచారం మేరకు దీనిపై పూర్తి స్పష్టత వచ్చింది.

ADVERTISEMENT

కొత్త సంవత్సరం కానుకగా మెగా అభిమానులను పలకరించేందుకు జనవరి 4వ తేదీన, అదే విజయవాడలో మెగా వర్గమంతా “ఖైదీ నంబర్ 150” ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తరలిరానుంది. వీకెండ్ కాకుండా, వీక్ డేస్ లో ఈ వేడుకను ఏర్పాటు చేయడం విశేషం. మెగా అభిమానులకు కన్నులవిందుగా మార్చేందుకు చిత్ర యూనిట్ తో పాటు మెగా హీరోలంతా ఈ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఎట్టకేలకు మెగా ఫ్యాన్స్ ను పూర్తి ఉత్సాహంలో ముంచెత్తే అసలు వార్త వెలుగు చూసిందన్న మాట

ADVERTISEMENT
Latest Stories