“ఖైదీ” ఆడియోకు “కాటమరాయుడు” స్పెషల్!

khaidi-no-150-audio-release-dream-day-mega-fans‘మెగాస్టార్’ను వెండితెరపై చూడాలన్న పదేళ్ళ మెగా అభిమానుల నిరీక్షణ రానున్న సంక్రాంతి పండగతో ముగియనుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను డిసెంబర్ రెండవ వారానికల్లా ముగించనున్నారు. ఇటీవలే యూరప్ లో పాటల చిత్రీకరణ జరుపుకోగా, మిగిలి ఉన్న పాటలను హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో చిత్రీకరించనున్నారు. అలాగే బాలన్స్ టాకీ పార్ట్ కోసం ఓ నాలుగైదు రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు.

ఇలా సర్వహంగులతో సిద్ధమవుతున్న “ఖైదీ నంబర్ 150” సినిమా ఆడియో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. బహుశా ఈ ఈవెంట్ కోసమే మెగా అభిమానులు ఎంతగానో వేచిచూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే… ఈ ఆడియోకు ముఖ్యఅతిధి మరెవరో కాదు… చిరంజీవి సోదరుడు “కాటమరాయుడు” పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సమాచారం లీక్ అయ్యింది. “ఖైదీ నంబర్ 150” ఆడియో వేడుకను నిర్వహించనున్న శ్రేయాస్ మీడియా ద్వారా వెలువడిన ఈ సమాచారం తర్వలోనే అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

ADVERTISEMENT

అంతేకాదు, పవన్ కళ్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అంటూ తెగ హంగామా చేసిన అల్లు అర్జున్ కూడా ఈ వేడుకలో భాగస్వామి కానున్నారు. ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత కనుక, ఎలాగూ చెర్రీ హాజరు అనివార్యం. దీంతో మెగా అభిమానులకు కన్నుల పండుగగా ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరోలతో పాటు మరో మెగా బ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజలు కూడా కనువిందు చేయనున్నారు. చూడబోతుంటే డిసెంబర్ 18వ తేదీ మెగా అభిమానులకు ‘డ్రీం డే’గా మారే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories