ప్చ్… “ఖైదీ నంబర్ 150” వాయిదా తప్పదా… ?

khaidi-no-150-release-postponed మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేడుకకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో తాజాగా ‘వాయిదా’ అనే మాట తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. సెన్సార్ పూర్తయ్యి దాదాపుగా నాలుగు రోజులు గడిచిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించని చిత్ర యూనిట్, 4వ తేదీన విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్లానింగ్ చేసింది. కానీ, ఈ వేడుకలో అభిమానులు ఆశించే ధియేటిరికల్ ట్రైలర్ కటింగ్ కు సమయం పట్టే విధంగా ఉండడంతో, జనవరి 7వ తేదీకి వాయిదా పడనుందన్న సంకేతాలను వ్యక్తం అవుతున్నాయి.

ఇదే గనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కు తీవ్ర నిరుత్సాహం తప్పదు. ఆడియో వేడుకను కూడా ఇలాగే వాయిదాలు వేసి, చివరికి రద్దు చేయడంతో షాక్ కు గురైన ఫ్యాన్స్, ఈ వేడుక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. స్వయంగా రామ్ చరణ్ కూడా ఈ వేడుకకు సంబంధించి అధికారిక ప్రకటన చేసారు. దీంతో 4వ తేదీ పక్కా అని ఫిక్స్ అయిన ఫ్యాన్స్ కు లేటెస్ట్ న్యూస్ కలవరపెడుతోంది. అయితే అధికారికంగా చిత్ర యూనిట్ నుండి గానీ, యూనిట్ సభ్యుల నుండి గానీ ఎలాంటి సమాచారం వెలువడలేదు.

ADVERTISEMENT

ప్రీ రిలీజ్ ఈవెంట్ కబుర్లు ఇలా ఉంటే… “ఖైదీ నంబర్ 150” విడుదల సంగతులు మాత్రం మెగా ఫ్యాన్స్ లో జోష్ ని నింపుతున్నాయి. ముందుగా అనుకున్న సమాచారం ప్రకారం జనవరి 13వ తేదీన సినిమాను విడుదల చేయాలని భావించగా, తాజా పరిణామాల ప్రకారం జనవరి 11వ తేదీనే “ఖైదీ”ని విడుదల చేయడానికి ముస్తాబు జరుగుతోందని టాక్. అంటే బాలయ్య సినిమా కంటే ఒక రోజు ముందుగానే విడుదల చేయాలన్నది లేటెస్ట్ టాక్. ఈ వార్తలు ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపేవే. ఈ అధికారిక సమాచారాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా రామ్ చరణ్ ప్రకటించబోతున్నారని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories