రికార్డుల్లో ‘ఖైదీ నంబర్ 150’ కుమ్ముడే కుమ్ముడు!

khaidi-no-150-song-record-2-million-clicksమెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ “ఖైదీ నంబర్ 150” యూ ట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే 5 మిలియన్ క్లిక్స్ ను దాటి 6 మిలియన్ దిశగా సాగుతుండగా, తాజాగా విడుదలైన ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాట కూడా అదే రేంజ్ లో యూ ట్యూబ్ లో సందడి చేస్తోంది. ఈ పాటను విడుదల చేసిన 24 గంటల్లోనే 2 మిలియన్ క్లిక్స్ ను అందుకుని సరికొత్త రికార్డును సృష్టించింది.

ఒక పాటకు 24 గంటల్లో 2 మిలియన్ క్లిక్స్ అందుకున్న తొలి సినిమా “ఖైదీ నంబర్ 150” రికార్డులు సృష్టించింది. పాట పరంగా పెద్దగా స్పందన రాకపోయినప్పటికీ, మెగాస్టార్ సినిమాపై ఉన్న అంచనాల రీత్యా ఈ సినిమా పాటలు ఎలా ఉంటాయా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొనడంతో, ఈ పాట అత్యధిక క్లిక్స్ అందుకుని మెగా అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. మొత్తానికి యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడంలో ‘మెగాస్టార్’ బిజీగా ఉన్నారని అర్ధమవుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories