పాపం కిషన్ రెడ్డికి మొదటి రోజే తలంటేశారు

kishan-reddy-on-terrorists-in-hyderabadకేంద్ర మంత్రిగా ఛార్జ్ తీసుకున్న రోజే పాపం కిషన్ రెడ్డికి అక్షింతలు పడ్డాయట. రాష్ట్రంలో తెరాసను వదిలేసి ఎంఐఎంను మాత్రమే టార్గెట్ చెయ్యడానికి బాగా అలవాటు పడ్డారేమో అదే పని జాతీయ స్థాయిలో చేసి ఇబ్బందులు పడ్డారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు దొరికినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యనించడం విమర్శలకు తావిచ్చింది. బెంగళూరు, భోపాల్ సహా ఎక్కడ ఉగ్ర ఘటనలు జరిగినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని, హైదరాబాద్‌లో ప్రతి 2-3 నెలలకు ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అరెస్టు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.

ADVERTISEMENT

అయితే దీనిపై ఓవైసీ విరుచుకుపడ్డారు. బాధ్యతగల మంత్రి ఇంత బాధ్యతారహితంగా మాట్లడటం ఏమిటంటూ నిప్పులు చెరిగారు. ఉగ్రవాదానికి హైదరాబాద్ సేఫ్ జోన్ అని ఎన్ఐఏ, ఐబీ, రా ఎన్నిసార్లు లిఖిత పూర్వకంగా చెప్పాయని మంత్రిని ప్రశ్నించారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకిగా కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా హిందూ, ముస్లిం పండుగలు, ఊరేగింపులు ఎంతో ప్రశాంతంగా జరుగుతున్న విషయం కిషన్‌రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఎంఐఎం, తెరాస రాజకీయంగా వాడుకుని బీజేపీని తెలంగాణ ద్వేషిగా చిత్రీకరిస్తారని, ఇప్పుడు నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని భవిష్యత్తు మీద దృష్టిపెట్టిన పార్టీకి ఇవి ఎంతమాత్రం అవసరమైనవి కావని ఆ పార్టీ అధినేత, హోం శాఖ మంత్రి మిత్‌షా తన డిప్యూటీని మందలించినట్టు తెలుస్తోంది. కేంద్రంలో బాధ్యతాయుత పదవిలో ఉన్నప్పుడు అత్యుత్సాహం పనికి రాదని అమిత్ షా కిషన్ రెడ్డికి హితవు పలికారట. పాపం కిషన్ రెడ్డికి మొదటి రోజే తప్పలేదు.

ADVERTISEMENT
Latest Stories