కొడాలి నోరు విప్పితే అంతే మరి

Kodali-Naniబూతుల మంత్రిగా పేరొందిన కొడాలి నాని తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకొని తిరిగి వచ్చిన తరువాత ఆయన మీడియా ముందుకు రాకపోవడంతో, ఆయన బూతులు మాట్లాడటం మానేశారని చాలా మంది భ్రమపడ్డారు. కానీ పైన కటవుట్ మారినా లోన కంటెంట్ మారలేదని ఈరోజు మరోసారి నిరూపించారు.

ఈ ఏడాది సంక్రాంతి పండుగకి గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొడాలి నాని స్పాన్సర్ చేసిన ఆ క్యాసినోకి హైదరాబాద్‌లో నివశిస్తున్న క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ నిర్వహించారని టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. మొన్న ప్రవీణ్ ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ అధికారులు త్వరలో కొడాలి నాని ఇంటి తలుపు తట్టడం ఖాయమని అన్నారు. త్వరలో కొడాలి నానితో పలువురు వైసీపీ నేతలు జైలుకి వెళ్ళక తప్పదని వర్ల రామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

దాంతో కొడాలి నాని మళ్ళీ తన నోటికి పని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “పనీ పాటు లేని నలుగురు 420 గాళ్ళు, సన్నాసులు, లుచ్చాగాళ్ళు ఊసుపోక, తిన్నది అరక్క కాలక్షేపం కోసం వాళ్ళ మీడియా ముందు కూర్చొని నా గురించి అడ్డమైన వాగుడు వాగారు. వాళ్ళు నిజంగా మొగాళ్ళే అయితే, వాళ్ళకి నిజంగా దమ్ముంటే గుడివాడలో క్యాసినో గురించి ఈడీకి నాపై ఫిర్యాదు చేయాలి. నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారో నేను చూస్తాను,” అంటూ సవాల్ విసిరారు.

టిడిపి, వైసీపీ నేతల రాజకీయాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు పక్కన పెడితే, క్యాసినో కింగ్స్ గా పేరుగాంచిన చికోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డిల వరకు వచ్చిన ఈడీ బృందాలు, మద్యలో కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోకుండా ఉంటే కొడాలి నాని వరకు రాకమానవు.

ADVERTISEMENT
Latest Stories