Kodali-Nani-Hari-Krishnaసరిగ్గా అయిదేళ్ళ క్రితం… సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతి పార్టీ ప్రచారం చేసుకుంటున్న వేళ… జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో కూడిన వైసీపీ బ్యానర్లు కృష్ణాజిల్లా రాజకీయాలలో కలకలం రేపాయి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వేదికగా వెలిసిన ఈ బ్యానర్ల వలన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ పేరు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ తారక్ తన వివరణను ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

కట్ చేస్తే… అయిదేళ్ళ తర్వాత కూడా కొడాలి నాని మళ్ళీ అలాంటి రాజకీయమే చేస్తున్నట్లుగా కనపడుతోంది. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో నందమూరి హరికృష్ణతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ…. “గురువు నందమూరి హరికృష్ణతో ఆత్మీయ కలయిక” అంటూ తెలిపారు. సరిగ్గా మళ్ళీ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలతో టిడిపిలో వర్గపోరుకు తెరలేపాలన్నది వైసీపీ ఎమ్మెల్యే అభిమతమో ఏమో గానీ, కొడాలి మాత్రం అలాంటి ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నారని చెప్పవచ్చు.