ఎన్టీఆర్ కాళ్ళకు దండం పెట్టి వచ్చేసాను!

Kota Srinivasa Rao, Kota Srinivasa Rao NTR Controversy, Kota Srinivasa Rao NTR Mandaladeesudu Controversy, Kota Srinivasa Rao Mandaladeesudu movie Controversy, ‘కళామ్మ తల్లి’ ముద్దుబిడ్డ కోట శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను వ్యక్తపరిచారు. “నా లాగా యాక్షన్ చేయడం ఎలా? అంటూ చాలా మంది చిన్న నటులు నన్ను అడుగుతుంటారు… వారికి నేను చెప్పే సమాధానమేమిటంటే… నటన అనేది చెబితే రాదు… పరిశీలించి నేర్చుకోవాలని వారికి చెబుతుంటాను” అని అన్నారు. ఈ చిత్రాల్లో ఎందుకు నటించానని అనుకుని బాధపడిన సినిమాలు కూడా తన కెరీర్లో కొన్ని ఉన్నాయని, మంచి పక్కనే చెడు కూడా ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

ADVERTISEMENT

గతంలో తాను నటించిన ‘మండలాధీశుడు’ చిత్రం తర్వాత ఒక గ్రూప్ తనకు ఏడాది పాటు అవకాశాలు ఇవ్వలేదని… అయితే, హీరో కృష్ణతో పది నుంచి పదిహేను సినిమాల్లో అప్పుడు తాను నటిస్తున్నానని, దీంతో తానేమీ పెద్దగా ఇబ్బంది పడలేదని చెప్పారు. ఆ చిత్రంలో ఎన్టీరామారావు గారిని తానెక్కడా తిట్టలేదు… రామారావు గారు తిడితే ఎలా ఉంటుందనేది మాత్రమే ఆ సినిమాలో ఉంటుందని అన్నారు.

మహానుభావుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి… ఆయన గురించి సినిమా తీస్తే, ఆయన పిల్లలకు, వాళ్ల వాళ్లకు కోపం రావడం సహజం. ఒకసారి, ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ గారు కనపడితే వెళ్లాను. ఆయన మాట్లాడారు. నా భుజం తట్టి ‘మంచి భవిష్యత్ ఉన్న నటులు మీరు’ అన్నారు. నేను ఆయన కాళ్లకు దండం పెట్టి వచ్చేశాను’ అని కోట శ్రీనివాసరావు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories