కోటం రెడ్డి హత్య కు కుట్ర.?

Viral video shows murder plot against TDP MLA Kotam Reddy Sridhar Reddy in Andhra Pradesh

అధికార పార్టీ ఎమ్మెల్యే పై హత్యకు ప్రణాళికలు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నుతున్నట్టుగా ఆ వీడియోలో కొందరు సంభాషణలు జరుపుతున్నారు.

కోటం రెడ్డి ని చంపితే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కొంతమంది ముఠా గా ఏర్పడి ఒక రూమ్ లో మద్యం తాగుతూ ఎమ్మెల్యే హత్య కు కుట్ర పన్నుతున్నారు. అయితే ఈ వీడియో పై స్పందించిన ఎస్పీ కృష్ణ క్రాంత్ వెంటనే విచారణ జరుపుతున్నారు.

ADVERTISEMENT

అయితే ఇందులో కనిపిస్తున్న ఒక వ్యక్తి రౌడీ షీటర్ శ్రీకాంత్ కు ప్రధాన అనుచరుడిగా భావిస్తున్నారు. కాగా మిగిలిన వారి పై సైతం రౌడీ షీట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే శ్రీకాంత్ బయటకు రావడానికి ఫెరోల్ ఇచ్చిన ఎమ్మెల్యే కోటం రెడ్డి పైనే ఇప్పుడు ఆయన అనుచరులు హత్యకు కుట్ర పన్నుతున్నారు అంటే వారి వెనుకున్న వారు ఎవరన్నది తెలియాలి.

అయితే శ్రీకాంత్ తండ్రి కోరిన మేరకే తానే శ్రీకాంత్ కు పెరోల్ లెటర్ ఇచ్చానని, ఇక పై ఎవరికీ తన నుండి పెరోల్ లెటర్ ఇవ్వనని కోటం రెడ్డి ఓపెన్ గానే తన పొరపాటును ఒప్పుకుని ఇక పై తప్పు జరగదు అంటూ హామీ ఇచ్చారు. దీనితో శ్రీకాంత్ వచ్చిన దారినే తిరిగి జైలుకెళ్లారు. ఈ నేపథ్యంలో కోటం రెడ్డి పై హత్యకు కుట్ర జరగడంతో దీని వెనుక శ్రీకాంత్ హస్తం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికార పార్టీ ఎమ్మెల్యే ల పైనే ఇలా వరుస బెదిరింపులు రావడం, మొన్న కొవ్వూరు టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సైతం తనను హత్య చేస్తానని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ చేస్తున్నారని, మెసెజ్ లు పెడుతున్నారంటూ ఆరోపించారు, ఇప్పుడు ఏకంగా అలా బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.

అయితే ఈ బెదిరింపులు ఎదుర్కున్న ఇద్దరు నేతలు గతంలో వైసీపీ పార్టీ నుండి జగన్ ను విమర్శిస్తూ బయటకు వచ్చి టీడీపీ లో చేరిన వారు కావడం విశేషం. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండడానికి ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిఅప్క్షనికి అంటే నిబద్దత ఉండాలి.

అలాకాకుండా టీడీపీ నేతలను రప్ప రప్ప నరుకుతాం అంటూ వైసీపీ క్యాడర్ పోస్టులుపెడుతుంటే వాటిని పార్టీ అధినేత తప్పేముంది అంటూ ప్రోత్సహిస్తున్నారు, ఇక ఆ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని అరవడం కాదు కరిచేయాలి, చీకట్లో పని కానిచ్చేయాలి, పొద్దున్నే వెళ్లి పరామర్శించేయాలి అంటూ పార్టీ క్యాడర్ ను హింస వైపు ప్రోత్సహిస్తున్నారు.

ఈ తరహా ప్రతిపక్ష రాజకీయం రాష్ట్రాన్ని రావణ కాష్ఠంగా మార్చగలదు. అయితే కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలను ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇటువంటి రౌడీ షీటర్ల అరాచకాలు, ఆకతాయిల అకృత్యాలు పెరిగిపోయి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories