అరకు ఎంపీ కొత్తపల్లి గీత జనజాగృతి పార్టీని స్థాపించారు. మార్పు కోసం ముందడుగు అనేది జనజాగృతి పార్టీ నినాదమని ఆమె చెప్పారు. పార్టీ జెండాను కూడా ఆమె విడుదల చేశారు. నీలం రంగు, తెలుపు రంగుతో కూడిన జెండాపై గొడుగు చిహ్నాన్ని ముద్రించారు. తాను పార్టీ నడపలేరు అన్న వారికి కూడా ఆమె సమాధానం చెప్పారు.
[m9ad]
తాను డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశానని, నాలుగున్నరేళ్లు ఎంపీగా ఉన్నానని, విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహతో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. గిరిజన ప్రాంత సమస్యల్ని పార్లమెంట్‌లో ప్రస్తావించానని చెప్పారు. రాజకీయ పార్టీలున్నది ప్రజల కోసమేనని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని ఆవిడ చెప్పుకొచ్చారు.
2014లో వైకాపా తరఫున అరకు నుంచి ఎంపీగా ఎన్నికైన గీత.. ఆ తరువాతి కాలంలో ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మొదట్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఆమె తరువాత ఆ పార్టీని విమర్శిస్తూ బీజేపీకి దగ్గరైనట్టుగా వ్యవహరించారు. ఇటీవలే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వైకాపా నాయకత్వానికి లేఖ పంపారు.



