పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి ఏముంటుంది!

krishna-vamsi-interview-about-pawan-kalyan‘జనసేన’ అనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న విషయం తెలిసిందే. పవన్ పొలిటికల్ ఎంట్రీ పైన సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం కలిగి ఉంటుంది. మరి ఇదే ప్రశ్నను క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీని అడిగితే… తనకు పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి అభిప్రాయం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఒక చిరంజీవికి తమ్ముడిగా తప్ప వ్యక్తిగతంగా గానీ, ప్రొఫెషనల్ గా గానీ పవన్ తో తనకు ఎలాంటి అనుబంధం లేదని, అందుకే పవన్ గురించి చెప్పడానికి ఏమీ లేదన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

దేశంలో చాలా మంది రాజకీయ పార్టీలు పెడుతున్నారు, ఎవరికి తోచిన విధంగా వారు చేస్తున్నారు. అలా చేసే వారిని చేయనివ్వాలి అనేది తన అభిప్రాయమని, అంతేగానీ, ముందుగానే వారిపై ఒక నిర్ణయానికి రావడం తన పద్ధతి కాదని, రాజకీయ పరంగా తనకు దేశం మొత్తాన్ని కలిపి చూస్తాను తప్ప, వ్యక్తిగతంగా ఎవరినీ చూడనని… పొలిటిక్స్ పై తనకున్న అభిప్రాయాన్ని తెలిపారు. ఓ రెండు మూడు సార్లు హాయ్ అంటే హాయ్ అనుకున్నాము, అలాగే ఓ రెండు సార్లు సినిమా చేద్దామనుకున్నాము గానీ కుదర్లేదు, అంతేతప్ప తనకు పవన్ కళ్యాణ్ గురించి సమగ్రంగా తెలియదని స్పష్టత ఇచ్చారు.

ADVERTISEMENT

అయితే పవన్ కళ్యాణ్ అంటే ఓ పెద్ద కమర్షియల్ స్టార్ అని, అందులో ఎలాంటి అనుమానం లేదని, అయితే పవన్ గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి తనకు లేదని, అంత సమయం కూడా లేదన్న కృష్ణవంశీ, అసలు పవన్ మీద తనకు ఎందుకు ఓ అభిప్రాయం ఉండాలని ఎదురు ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో కూడా తనకు ఇదే రకమైన అభిప్రాయం ఉందని, పవన్ అంటే పడకపోవడం అంటూ ఏమీ లేదని, తానూ ఆ స్థాయిలో కూడా లేనని, పవన్ ఎలా అయితే ఓ హీరోనో, నేను ఓ దర్శకుడిని, తెలంగాణా సాయుధ పోరాటం మీద పవన్ తో సినిమా చేయాలనుకున్నానని వచ్చిన వార్తలలో నిజం లేదని స్పష్టత ఇచ్చారు.

పవన్ లాంటి ఒక స్టార్ హీరోపై ఈ రకమైన అభిప్రాయాలను వ్యక్తపరచడం బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఓ తమ్మారెడ్డి భరద్వాజ… ఓ కృష్ణవంశీ… ఇలా వ్రేళ్ళ పైనే లెక్కపెట్టవచ్చు. సహజంగా పెద్ద హీరోలంటే ‘భజన’ చేయడమే అలవాటుగా మారిన సినీ జనాలకు కృష్ణవంశీ లాంటి దర్శకుల మాటలు పెద్దగా రుచించకపోవచ్చు. అయితే తనకున్న అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు కృష్ణవంశీ.

ADVERTISEMENT
Latest Stories