నేను చెప్పేదాకా ఏదీ నమ్మొద్దు

Krishna Vamsi Naksahtramఒకప్పుడు మరపురాని సినిమాలు ఇచ్చిన కృష్ణవంశీ ఈ మధ్య కాలంలో ప్లాపులతో సతమతం అవుతున్నాడు. ఆయన నుండి చివరిగా వచ్చిన నక్షత్రం అనే సినిమా విడుదల రోజే నామరూపాలు లేకుండా పోయింది. అయితే ఈ రోజు ఉదయం నుండి కృష్ణవంశీ కమ్ బ్యాక్ అంటూ వార్తలు వచ్చాయి. రుద్రాక్ష సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనే ఫిలిం మీద వర్క్ చేస్తున్నారని. టాప్ హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారని, అది ఓకె అయితే సినిమా అనౌన్స్ మెంట్ బయటకు వస్తుందని ఆ వార్తల సారాంశం.

అంతే కాకుండా ఒకప్పుడు భారీ సినిమాలు తీసిన నిర్మాత బండ్ల గణేష్ చాలా గ్యాప్ తరువాత నిర్మాతగా రాబోతున్నారని కూడా అన్నారు. 2015లో వచ్చిన టెంపర్ తరువాత బండ్ల సినిమాలేమీ చెయ్యలేదు. .అయితే ఈ వార్త నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. కాసేపటి క్రితం కృష్ణవంశీ ట్విట్టర్ లో మాట్లాడుతూ నేను చెప్పేదాకా ఏదీ నమ్మొద్దు అని అన్నారు. దీనితో ఉదయం నుండీ ఈ వార్తలతో ఖుషీగా ఉన్న ఆయన అభిమానులు ఒక్కసారిగా నీరసపడిపోయారు.

ADVERTISEMENT

2002లో వచ్చిన ఖడ్గం తరువాత కృష్ణవంశీకి హిట్ కోసం 2007లో వచ్చిన చందమామ దాకా ఆగాల్సి వచ్చింది. ఆ తరువాత నుండి ఆయనకు హిట్ లేదు. 2014లో రామ్ చరణ్ తో ఆయన చేసిన గోవిందుడు అందరి వాడేలే ఒక మాదిరిగా ఆడింది. ఆ తరువాత మూడు సంవత్సరాలకు వచ్చిన నక్షత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆయన తదుపరి చిత్రంతో హిట్ కొట్టి తిరిగి విజయాల బాటలోకి వస్తారని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories