ఈర్ష్యతో జగన్‌ ఎంత నష్టపోయారో…. ఇదే సాక్ష్యం!

Krishna river waters reaching Kuppam through Handri Neeva project, Chandrababu Naidu gaining credit in Rayalaseema

ఎక్కడ శ్రీశైలం.. ఎక్కడ కుప్పం?శ్రీశైలం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ద్వారా కుప్పం వరకు కృష్ణమ్మ నీళ్ళు గలగలా ప్రవహిస్తున్నాయిప్పుడు.

ఇలా జరిగితే కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందనే ఈర్ష్య చెందారు తప్ప ఈ ప్రాజెక్ట్ పూర్తిచేసి రాయలసీమకు తాగుసాగు నీరు అందిస్తే లక్షల మంది జీవితాలలో మార్పు వస్తుందనే ఆలోచన చేయలేదు.

ADVERTISEMENT

కర్నూలు న్యాయ రాజధాని పేరుతో రాయలసీమ వాసుల ఓట్లు కొల్లగొట్టాలనుకున్నారే తప్ప ఈ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసి సీమ ప్రజలకు నీళ్ళు అందిస్తే వారు తనకు నీరాజనాలు పడతారని జగన్‌ గ్రహించలేకపోయారు!

వైనాట్ కుప్పం?అంటూ కుప్పంలో నీచ రాజకీయాలు చేస్తూ చంద్రబాబు నాయుడుని ఆయన సొంత నియోజకవర్గంలోనే దెబ్బ తీయాలనుకున్నారు తప్ప ఇలా కుప్పంకు నీళ్ళు అందించి అక్కడి ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లు పొందవచ్చని గ్రహించలేకపోయారు!

ఎందువల్లనంటే ఆయన కళ్ళకు ఈర్ష్య క్యాటరాక్ట్ పొరలా కమ్మేసింది కనుకనే! అందువల్లే అమరావతిని నిర్మించి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తనకి శాశ్వతమైన చోటు సంపాదించుకోవచ్చానే ఆలోచన కూడా కలుగలేదు పాపం! అంతేకాదు.. జగన్‌ తాను ఎంతగానో ద్వేషించే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకే స్వయంగా ఈ క్రెడిట్ అంతా దక్కేలా చేశారు.

కనుక జగన్‌ వదులుకున్న ఈ గొప్ప అవకాశాలను ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనులు చకచకా జరిపిస్తున్నారు.

జగన్‌ పక్కన పడేసిన హంద్రీనీవా ప్రాజెక్ట్ పనులు చకచకా జరిపించి రాయలసీమ జిల్లాలకు కృష్ణమ్మని తీసుకువచ్చారు.

శ్రీశైలం నుంచి సుమారు 600 -700 కిమీ దూరం ప్రయాణించి కృష్ణా జలాలు శుక్రవారం కుప్పంకి చేరుకున్నాయి. దశాబ్ధాలుగా కృష్ణమ్మ కోసం ఎదురుచూస్తున్న రాయలసీమ ప్రజలు తండోపతండాలుగా తమ ఊర్ల మద్య నుంచి కాలువలలో గలగలా పారుతున్న కృష్ణానది నీళ్ళలో దిగి ఆనందపారవశ్యంతో పొంగిపోయారు.

ఇక సీమ జిల్లాలోని టీడీపీ శ్రేణుల హడావుడి అంతా ఇంతా కాదు. కాలువల వెంబడి టీడీపీ జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీలు చేశారు. టీడీపీ జెండాలు పట్టుకొని కాలువలలో దిగి జలకాలాడారు.

నేడు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కుప్పంకు చేరిన కృష్ణమ్మకు గంగపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా కుప్పంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సీమజిల్లాలలో 10 లక్షల మందికి త్రాగునీరు అందుతుంది.

ఓ పక్క ఏపీలో జగన్‌, మరోపక్క తెలంగాణలో హరీష్ రావుతో సహా బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఏడుస్తూనే ఉన్నారు. అయినా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పట్టుదలగా కేవలం ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి నేడు కుప్పంకు కృష్ణమ్మని తెచ్చుకున్నారు.

కుప్పంతో పాటు రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడుకి జేజేలు పలుకకుండా ఉంటారా?దేవుడు తన వెంటే ఉన్నాడని జగన్‌ చెప్పుకుంటారు. కానీ జగన్‌ ఒకటనుకుంటే ఎప్పుడూ మరొకటి జరుగుతుంటుంది. ఎందువల్ల అంటే ఈర్ష్య వల్లనే!

ADVERTISEMENT
Latest Stories