KTR Skipping Telangana Assembly Sessions

అధికార పక్షమైతే అందలం ఎక్కుతాం కానీ ప్రతిపక్షమైతే పని చేయం అనేలా రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇటు తెలంగాణలో తీసుకున్నా, అటు ఆంధ్రాలో చూసినా ప్రతిపక్ష పాత్ర వహించాల్సిన బిఆర్ఎస్, వైసీపీలు వాటి బాధ్యతను విస్మరించి తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయినా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇంకా తన ప్రయాణం మొదలుపెట్టనే లేదు. అలాగే కేసీఆర్ స్థానాన్ని భర్తీ చేయడానికి తాపత్రయ పడుతున్న కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రజా గొంతు వినిపించడానికి కాకుండా పార్టీ మీద తమ పట్టు సాధించడానికి మొగ్గు చూపుతున్నారు.

Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ

ఈ నేపథ్యంలోనే నేడు మొదలైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కార్యక్రమానికి హాజరయిన బిఆర్ఎస్ నాయకులు అదానీ, రేవంత్ ఫోటోలను ముద్రించిన టీ షర్ట్స్ ధరించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయబోతుంటే అధికారులు వారిని అడ్డుకున్నారు. దీనితో కేటీఆర్, హరీష్ లతో కలిసి బిఆర్ఎస్ నేతలు అక్కడే ఆందోళన చేపట్టారు.

ఇటువంటి వస్త్రధారణతో అసెంబ్లీలోకి అనుమతి ఉండదని తెలిసి కూడా బిఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ ముందు బెటాయించడాన్ని ఏమనాలి.? అసెంబ్లీ డుమ్మా కొట్టడానికి దొడ్డి దారులు వెతుకుతున్నారు అనాలా.? లేక కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఏడాది గడుస్తున్నా కేసీఆర్ కు ఇంకా అజ్ఞాతవాసం పూర్తవలేదా.? అంటూ ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందనలా.?

Also Read – M9 పాఠకులకు ‘భోగి’ పండుగ శుభాకాంక్షలు..!

అంబానీ..రేవంత్ భాయ్ భాయ్ అంటూ స్లోగన్స్ ఇవ్వడం…ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అంటూ నినాదాలు చెయ్యడం…ఆ పిదప అరెస్టులయ్యి ప్రభుత్వం కక్ష్య పూరిత రాజకీయాలు చేస్తుంది అంటూ చేతులు దులుపుకోవడం బిఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిపోయినట్టు ఉంది.

అసెంబ్లీ ఎదుట గలాటా చేయడం, అధికారులు వారిని అడ్డుకుని అరెస్టులు చేయడమే బిఆర్ఎస్ నేతల ధ్యేయం అన్నట్టుగా కేటీఆర్ నడుచుకుంటున్నారు. నిజంగా రేవంత్ అదానీల గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలి అనుకుంటే అసెంబ్లీకి వెళ్లి చట్ట సభలలో తమ గళం వినిపించాలి అంతే కానీ ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటే ఇలా రోడ్ల మీద, లేదా జగన్ మాదిరి ప్రెస్ మీట్ల ద్వారా కాదు.

Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!

ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ జరిగే మేలు శూన్యమనే చెప్పాలి. కేవలం ఇది ఒక రాజకీయ లబ్ది కోసం బిఆర్ఎస్ చేసే ఒక ప్రయత్నంగానే పరిగణించాల్సి ఉంటుంది. బిఆర్ఎస్ నేతల ఆందోళనతో కేటీఆర్, హరీష్ లతో పాటుగా ఆ పార్టీ శ్రేణులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు అధికారులు. అయితే ప్రతిపక్షాలు భావిస్తున్నట్టు అరెస్టు అంటే ఒక హోదా కాదు , జైలు అంటే ఒక పదవి మార్గం కాదు.




బాధ్యత నుంచి తప్పించుకునే ఒక మార్గంగా, పార్టీ సానుభూతి పరుల మెప్పు పొందే ఒక అస్త్రంగా, మీడియా దృష్టిని ఆక్షరించే ఒక బ్రేకింగ్ వార్తగా ఈ రాజకీయ అరెస్టులు నానాటికి తమ విలువను కోల్పోతున్నాయి అనేది రాజకీయ పార్టీలతో పాటుగా ఆపార్టీల నాయకులు గుర్తించాలి. అన్ని అరెస్టులు పదవికి అవకాశాలు కావు కాలేవు.