ఎన్నికల తరువాత కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమా?

KTR - T Harish Raoవచ్చే ఎన్నికలలో తెరాస అత్యధిక మెజారిటీతో గెలిస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసి, కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని సమాచారం. ఆ దిశగా సంకేతాలు కూడా ఇస్తున్నారు కేసీఆర్. ఇటీవలికాలంలో ఆయనకు పార్టీలో, ప్రభుత్వంలో లబిస్తున్న ప్రాధాన్యత, ఆయన నిర్వహిస్తున్న వివిధ కార్యకలాపాలు, ప్రతిపక్షాల విమర్శలకు కేటీఆర్ ఇస్తున్న సమాదానాలు..ఇవన్ని దానినే సూచిస్తుంది.

[m9ad]

ADVERTISEMENT

గతంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎప్పుడు విమర్శలు చేసినా, కేసీఆర్ స్వయంగా సమాదానం ఇచ్చేవారు. కాని ఈసారి కేటీఆర్ జవాబు ఇచ్చారు. కొండగట్టు ప్రమాదం భాదితులను పరామర్శించడానికి కేటీఆర్ వెళ్లారు. ప్రగతి నివేదన సభ నిర్వహణలో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించారు.

కాగా మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని ప్రకటించారు. దీనితో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చెయ్యడానికి లైన్ క్లియర్ అయినట్టే. ఒకవేళ తెరాసకు బొటాబొటి మెజారిటీ వస్తే 2014 తరువాతిలాగ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించి పార్టీని బలోపేతం చేసేదాకా కేసీఆరే సీఎంగా ఉంటారు అనేది వ్యూహమట.

ADVERTISEMENT
Latest Stories