గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసి నవ్వుకున్న పొరుగు రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను చూసి సిగ్గుపడుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల సమయంలో ఆంధ్ర తల్లి, తెలంగాణ తల్లి అంటూ భారత మాత బిడ్డలను రెండుగా చీల్చి రాజకీయం చేసిన తెరాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ తల్లి, బిఆర్ఎస్ తల్లి అంటూ తెలంగాణ తల్లిని రాజకీయ నడి వీధిలో నిలుచోపెట్టారు.
నేడు రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది రేవంత్ సర్కార్. అయితే గత ప్రభుత్వ డిజైన్ ను మార్పు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రూపంలో ఆకుపచ్చ రంగు చీరలో, చేతిలో వరి కంకు పట్టుకుని నిలబడిన తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించారు.
Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!
అయితే మా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్పు చేస్తూ రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన ఈ తల్లి తెలంగాణ తల్లి కాజాలదు అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడ్చల్ లో సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహనికి కౌంటర్ గా కేసీఆర్ నిర్ణయించిన రూపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పార్టీ శ్రేణుల కోలాహలాల మధ్య ఆవిష్కరించి ఆ విగ్రహానికి పాలాభిషేకం చేసి జై తెలంగాణ అంటూ నినాదాలు చేసారు.
ఈ కార్యక్రంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ చేసిన కేటీఆర్ మాట్లాడుతూ డిసెంబర్ 9 కాంగ్రెస్ తల్లి సోనియా పుట్టిన రోజును అధికారికంగా నిర్వించడానికే రేవంత్ ఈ విగ్రహ మార్పుకు శ్రీకారం చుట్టి మన తెలంగాణ తల్లిని బలి చేసారు అంటూ పేర్కొన్నారు.
Also Read – బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ‘అన్-స్టాపబుల్’..!
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ అపచారానికి పరిష్కారం చేయాల్సి ఉంటుంది. దీనికి గాను తెలంగాణ వాదులంతా 2007 ఉద్యమ సమయంలో ఏ తల్లినైతే మనం తెలంగాణ తల్లిగా భావించామో అదే ప్రతిమను మన సోషల్ మీడియా డిపి గా పెట్టుకుందాం, రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేద్దాం ఎవడు ఎం పీకుతాడో చూద్దాం అంటూ తెలంగాణ వాదాన్ని మరోసారి తన రాజకీయ లబ్ధికి వాడుకుతుంటుంది బిఆర్ఎస్.
అయితే ఇన్నాళ్లుగా తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణ తల్లి కోసం పోరాటాలు మొదలు పెట్టారు.కేసీఆర్ నిర్ణయించిన రూపమే తెలంగాణ తల్లి అంటూ బిఆర్ఎస్, కాదు కాదు తెలంగాణ తల్లి అంటే ఇదే అంటూ రేవంత్ సర్కార్ రూపొందిన రూపాన్ని చూపిస్తూ కాంగ్రెస్ నేతలు తల్లుల కోసం సిగపట్లు పట్టుకుంటున్నారు.
Also Read – సంక్రాంతికి వస్తున్నాం అన్నారు.. మరిచిపోకండి సార్లూ
ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం తమ ఓటు ఏ తల్లి కి అనేది స్పష్టం చెయ్యలేదు. అలాకాక బీజేపీ పార్టీ కూడా తెలంగాణకు మరోకొత్త తల్లిని ఆవిష్కరిస్తుందేమో చూడాలి. బీజేపీ కూడా మరో తెలంగాణ తల్లి రూపాన్ని తెరమీదకు తెస్తే, గతంలో ఏపీకి మూడు రాజధానులు తెచ్చిన మోనార్క్ ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర సృష్టించినట్టు, తెలంగాణకు ముగ్గురు తల్లులను తెచ్చిన పుత్రులుగా బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు చరిత్రలో మిగిలిపోతారు.
కాంగ్రెస్ సర్కార్ చేసిన అపచారానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేద్దాం.. ఆ తల్లిని క్షమాపణ అడుగుదాం.
ఈ కాంగ్రెస్ మూర్ఖులకు చరిత్ర తెల్వదు.. సన్నాసులను క్షమించమని కోరుదాం.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/umbw7pscci
— BRS Party (@BRSparty) December 9, 2024