ఆ మాత్రం దాపరికం ఎందుకు కేటీఆర్?

KTR on family Vacationరాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా మంత్రులు నిత్యం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ఐనంత మాత్రాన వారు ఎప్పుడు అదే పనిలో ఉండాలని వారికి వ్యక్తిగత జీవితం ఉండకూడదని ప్రజలు కూడా అనుకోరు. పని రాక్షసుడు వంటి చంద్రబాబు నాయుడు కూడా ఏడాదికి ఒకసారి కుటుంబంతో కలిసి టూర్ కు వెళ్తారు.

తెలంగాణ మంత్రి ఐదు రోజుల పాటు కర్నాటక టూర్ కు వెళ్లారట. ఆయన టూర్ సంగతి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారట. అయినా ట్వాటర్,చిట్ చాట్ వంటి వాటి ద్వారా తెలంగాణలోనే కెటిఆర్ ఉన్నారేమోనన్న భ్రమ కల్పిస్తున్నారట. అందువల్లే సెలవుపై కర్నాటక టూర్ కు వెళ్లినా ఆయన ట్వీట్ల రూపంలో మాత్రం మీడియాలో ప్రముఖంగా కనిపించారట.

ADVERTISEMENT

ఈ మాత్రం దానికి దాపరికం ఎందుకో? నిత్యం అధికారిక పనుల్లో బిజీగా ఉండే నాయకులు వారి కుటుంబాలతో కొంత కాలం గడిపితే ప్రజలకు ఏం ఇబ్బంది? లేదా నిత్యం ప్రజలకోసమే పనిచేస్తూ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసినట్టు చూపించుకునే ప్రయత్నమా?

ADVERTISEMENT
Latest Stories