రేవంత్ రెడ్డి తెదేపా విడిచి కాంగ్రెస్లో చేరడంతో మళ్లీ తెలంగాణాలో వలసల పర్వం మొదలయ్యింది. తెదేపానుండి కాంగ్రెస్కు భారీగా వలసలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మంత్రి కేటీఆర్ మధ్య వలసల ప్రస్తావన వచ్చింది.
“ఎక్కడకి వెళుతున్నారు?’’ అని సండ్రను మంత్రి కేటీఆర్ నవ్వుతూప్రశ్నించగా. ” ఎక్కడికీ వెళ్లడం లేదు” అని సండ్ర వెంకట వీరయ్య చెప్పినట్లు తెలుస్తోంది. కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతక్క పార్టీ మారుతారని వస్తున్న వార్తలు అవాస్తవమని, వారిద్దరూ తమ పార్టీలోనే ఉంటారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి వెళ్లడం వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఎమ్మెల్యే సండ్ర చెప్పుకొచ్చారు. 2014 శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో పదిహేను సీట్లు గెలుచుకున్న తెలుగుదేశంపార్టీ నుండి ఒక్కొక్కరుగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరిపోయారు. బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్య పార్టీతో అంటీ,అంటనట్లే ఉంటారు. రేవంత్ రెడ్డి రాజీనామాతో సండ్ర ఒకరే ఆ పార్టీలో ఉన్నారు.



