చంద్రబాబు అంతు తేల్చడానికి అవసరమైతే ఆంధ్రాలోనూ వేలు పెడతాం

KTR with Andhra Settlersకూకట్ పల్లి నియోజకవర్గం భారత్ నగర్ లో కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంగతి తేల్చడానికి అవసరమైతే ఆంధ్రా రాజకీయాల్లోనూ కేసీఆర్‌ వేలు పెడతారని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలొచ్చాక చంద్రబాబు, రాహుల్‌ గాంధీలు వీణ, ఫిడేల్‌లు వాయించుకోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో తాము ఏనాడూ తగాదాలు కోరుకోలేదన్నారు. అయితే చంద్రబాబు మాటిమాటికి తెలంగాణను అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు అని ఆరోపించారు.

[m9ad]

ADVERTISEMENT

సెప్టెంబర్ 6న కేసీఆర్ తెలంగాణ శాసనసభను రద్దు చేసినప్పుడు తెరాస విజయం నల్లేరుపై బండి నడకే అనుకున్నారు అందరూ. అయితే ఆ తరువాత టీడీపీ కాంగ్రెస్ తో జతకట్టాకా పరిస్థితిలు అనూహ్యంగా మారిపోయాయి. అప్పటిదాకా టీడీపీ 0.25% పార్టీ అని జోకులు వేసిన కేసీఆర్ ఉన్నఫళంగా చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు మొత్తంగా తెరాస ఎన్నికల ప్రచారం చంద్రబాబు చుట్టూనే తిరుగుతుంది. మహాకూటమికి అనుకూలంగా వచ్చిన సర్వేలు కూడా పొత్తుల వల్ల మొత్తం ఎన్నికల స్వరూపం మారిపోయిందని చెప్తున్నాయి.

బహుశా చాలా తేలికగా గెలవాల్సిన ఎన్నికల స్వరూపాన్ని మార్చేసినందుకు తెరాస వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బహుశా అవసరమైతే ఆంధ్రాలోనూ వేలు పెడతాం అని బెదిరింపులకు దిగుతున్నారు. అయితే ఇవన్నీ ఆలోచించకుండా చంద్రబాబు రంగంలోకి దిగి ఉంటారా? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చంద్రబాబు అంతు తేల్చడానికి కేసీఆర్ రంగంలోకి దిగితే అది తెలుగు దేశం పార్టీకి మేలు చెయ్యవచ్చు.

ADVERTISEMENT
Latest Stories