మోడీ ఎల్వీ సుబ్రహ్మణ్యనికి ఏమైని అభయం ఇచ్చారు?

l-v-subrahmanyam-ias-ys-jaganఎన్నికల సంఘం చేత నియమింపడిన చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పని చేస్తున్నారు. బీజేపీ సపోర్టుతో చెలరేగిపోతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి మీదే వ్యంగ్యంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటే ఆయన ఏ రకంగా చెలరేగిపోతున్నారో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసుపు కుంకుమ, రైతు రుణమాఫీ వంటి వాటి నిధులకు కూడా ఆయన అడ్డుపుల్ల వేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందొ చెప్పవచ్చు.

క్యాబినెట్ పాస్ చేసిన కొన్ని కీలకమైన బిల్లుల చెల్లింపు కూడా ఆపేశారు ఆయన. పూర్తిగా ఆయన పరిధిలో లేని ఎన్నికల కౌటింగు వ్యవహారాలపై కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీనితో తెలుగుదేశం నేతలు ఆయన పై విరుచుకుపడుతున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ద్వారా కేంద్రం రాష్ట్రపతి పాలనలా సాగిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఎల్వీ సుబ్రహ్మణ్యం తెగువపై ఆయన సహచర ఐఏఎస్ లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏం చూసుకుని ఇంత ధైర్యం అని నివ్వెరపోతున్నారు.

ADVERTISEMENT

అయితే నరేంద్ర మోడీనే ఎల్వీ సుబ్రహ్మణ్యం ధైర్యం అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిస్తే ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగడం ఖాయం. ప్రాధాన్యత లేని శాఖకు పంపిస్తారు. అయితే ఈ విషయంలో ఆయనకు మోడీ ప్రభుత్వం అభయం ఇచ్చిందంట. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే వెంటనే ఆయనకు కేంద్ర సర్వీస్ కు తీసుకుని ప్రాధాన్యత కలిగిన పదవి ఢిల్లీ స్థాయిలో ఇప్పిస్తాం అని మాట ఇచ్చారట. దీనితో ఎల్వీ సుబ్రహ్మణ్యం తన స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories