ఇంకో సీటు లగడపాటి కంఫర్మ్ చేశారా?

lagadapati rajagopal survey on Medipally Satyamఆంధ్ర ఆక్టోపస్ గా ప్రసిద్ధి చెందిన లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే తెలంగాణ ఎన్నికలలో గెలిచే ఇద్దరు ఇండిపెండెంట్ల పేర్లు చెప్పారు. ఇప్పుడు తాజాగా ఆయన కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు ఫోన్ చేసి ఆయన గెలవబోతున్నట్టు చెప్పినట్టు సమాచారం. తాను చేసిన సర్వే వివరాలతోపాటు, ఈ ఎన్నికల్లో సత్యంకు ఎన్ని ఓట్లు వస్తాయి అనేది తెలిపారట. దీనితో కాంగ్రెస్, మహాకూటమి నాయకులు సంబరాలలో తేలిపోతున్నారు.

ADVERTISEMENT

[m9ad]

లగడపాటి రాజగోపాల్‌, మేడిపలిసత్యంలు తెలంగాణ ఉద్యమంలో హోరాహోరీ తలపడిన నాయకులు. ఇలాంటి సందర్భంలో లగడపాటి నేరుగా మేడిపల్లి సత్యంకు ఫోన్‌చేసి చిన్న వయస్సులోనే పెద్ద ఫాలోయింగ్‌ సంపాదించావు.. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నావు.. ఇది ఎలా సాధ్యమయిందని అడిగారట. తాను విద్యార్థి ఉద్యమం నుంచి ప్రస్తుత స్థితి వరకు వివరించారట. ప్రజలకు ఎల్లప్పుడూ చేరువలో ఉండటమే తన ప్రస్తుత స్థితికి కారణమని చెప్పారట. అయితే మీడియాలో వస్తున్న ఈ వార్తలను లగడపాటి ధృవీకరించలేదు.

సత్యం మాత్రం కంఫర్మ్ చేశారు. గతంలో లగడపాటి ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పిన రెండు సీట్లు నారాయణపేట, బోత్త్ లోని అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ గా ఉన్నారు. ఇప్పుడు చొప్పదండి కూడా కాంగ్రెస్ కు వెళ్తుందని చెప్పడం ప్రజలు మహాకూటమి వైపు ఉన్నారని చెప్పినట్టేనా? దీనితో అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అదే విధంగా ఉద్యమ సమయంలో తనకు కొరకరాని కొయ్యలా ఉన్న లగడపాటి మళ్ళి ఇబ్బంది పెడుతున్నారని ఆయన మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తన పూర్తి సర్వేను డిసెంబర్ 7 సాయంత్రం వెల్లడి చేస్తా అని లగడపాటి ఇప్పటికే చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories