జనసేన అధినేతకు.. జనసైనికులకు… కనువిప్పు!

lagadapati-survey-jana-senaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడ సమావేశం పెట్టినా… అక్కడ ‘సిఎం సిఎం’ అంటూ నినాదాలు చేయడం పవన్ చెప్పే జనసైనికులకు పరిపాటిగా మారింది. అయితే మీరు అలా అంటే సిఎం అవ్వను, వెళ్లి ఓట్లు వేస్తే సిఎం అవుతాను అంటూ చెప్తోన్న జనసేన స్టామినా ఎంతో తాజాగా లగడపాటి ఫ్లాష్ టీం చెప్పింది. రాజకీయాలలో లగడపాటి రాజగోపాల్ సర్వేకున్న ప్రాముఖ్యతను ప్రత్యేకించి విశదీకరించాల్సిన పనిలేదు.

కేవలం 8.1 శాతంతో సింగిల్ డిజిట్ కే జనసేన పరిమితం అవుతుందని లగడపాటి టీం తేల్చిచెప్పింది. అధికార తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టడం ఖాయమంటూ తేల్చి చెప్తూ 110 సీట్లు వస్తాయని, ప్రతిపక్ష పార్టీ జగన్ మరోసారి అదే సీట్లో ఉంటూ 60 సీట్లకు పరిమితం అవుతారని, ఇతరులకు 5 స్థానాలు దక్కుతాయని లగడపాటి టీం చెప్పింది. అంటే ఇతరుల 5 స్థానాలలో జనసేన సరిపెట్టుకోనుందన్న మాట.

ADVERTISEMENT

రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ఇది ఊహించినదే అయినప్పటికీ, పవన్ కళ్యాణే కాబోయే సిఎం అంటూ ఊహల్లో మునిగితేలుతున్న వారికి మాత్రం ఇది కనువిప్పు కలిగినట్లే. బహుశా ఇప్పటికైనా వారంతా గాలిలో మేడలు కట్టడం ఆపి, నేలపై నడుస్తారేమో చూడాలి. అలాగే గత ఎన్నికలలో తాను చెప్పడం వలనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పుకుంటోన్న జనసేన అధినేతకు కూడా జ్ఞానోదయం అయినట్లే భావించవచ్చు.

అయితే ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలు. కానీ ఎన్నికలు జరిగే పరిస్థితి ఇప్పుడు లేదు. నవంబర్ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చన్న సంకేతాలు వస్తున్నప్పటికీ, ఎన్నికలకు సమయం మాత్రం మరో ఏడాది దాకా ఉంది. మరి ఈ ఏడాదిలో జరిగే మార్పు చేర్పులను బట్టి ఎన్నికల ఫలితాలు ఉంటాయి. కానీ ఏపీపై, ఏపీలోని అధికార పార్టీపై కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న కుట్రతో కుదేలవుతున్న టిడిపికి, ఈ సర్వే ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories