
మన దేశంలో చాలా మంది రాజకీయ నాయకులపై అనేక కేసులు ఉన్నాయి. వాటిలో భారీ అవినీతి కేసులు కూడా ఉంటాయి. అయినా కూడా వాటి నుంచి వారు చాలా సులువుగా తప్పించుకుంటారు.
Also Read – శ్యామల చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి..!
కానీ కొన్ని లాండ్ మార్క్ కేసులుంటాయి. వాటిలో శిక్షలు పడకుండా తప్పించుకోగలిగినా ఆ కేసులు మాత్రం వారిని జీవితకాలం వెంటాడుతూనే ఉంటాయి.
ఉదాహరణకు జగన్ ఆక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు వంటివి కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు, ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులు కూడా అటువంటి ల్యాండ్ మార్క్ కేసులే.
Also Read – జగనన్న రాజకీయ ప్రవచనాలు…
ఈ రెండు కేసులలో విచారణకు హాజరైనవారు తెలిపిన వివరాల ప్రకారం మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ప్రధాన సూత్రధారులు అని సిట్ బృందాలు భావిస్తున్నాయి.
ఈ రెండు కేసులు సమాంతరంగా విచారణ జరుగుతున్నప్పటికీ, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నత్త నడకలు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read – యావత్ దేశం దృష్టి విశాఖ పైనే…
ఈ కేసులో మరో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తిరిగి రప్పించగలిగితే చాలు కేసీఆర్‌ని చేరుకోవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయన కూడా ముందస్తు బెయిల్ ఇస్తే హైదరాబాద్ వచ్చేందుకు సిద్దమని చెపుతున్నారు.
కానీ ఆయనకు ముందస్తు బెయిల్ రాకుండా తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ తరపు న్యాయవాది అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
వారు ఏ కారణంతో ఆయనని అడ్డుకుంటున్నా ఆయన వస్తే తప్ప ఈ కేసు విచారణ ముగియదు. అంతవరకు కేసీఆర్ జోలికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలేదు.
ఇక ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ చాలా చురుకుగా సాగుతోంది. ఇప్పటికే కావలసిన సాక్ష్యాధారాలు అన్నీ సేకరించారు. కానీ జగన్‌ని టచ్ చేయాలంటే మరింత కీలకమైన, శాస్త్రీయమైన సాక్ష్యధారాలు అవసరమని సిట్ అధికారులు భావిస్తున్నందున తొందర పడటం లేదు. కానీ అతి త్వరలోనే ఈ కేసులో జగన్‌కి నోటీస్ పంపించే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ ఈ రెండు కేసులలో జగన్, కేసీఆర్ పాత్రలని సిట్ అధికారులు నిర్ధారించి, న్యాయ స్థానాలలో నిరూపించగలిగితే అక్కడ బిఆర్ఎస్ పార్టీ, ఇక్కడ వైసీపీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారవచ్చు.
కానీ ఇటువంటి కేసుల విచారణ పూర్తి కానీయకుండా ఏళ్ళ తరబడి కొనసాగేలా చేసి శిక్షల నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు ఇందుకు నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి.
కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు కేసులు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయో.. ఏవిదంగా ముగుస్తాయో అసలు ముగుస్తాయో లేదో ఎవరూ చెప్పలేరు.