Lulu Groupఒక ప్రభుత్వంతో ఒక వ్యాపార సంస్థ లేదా పరిశ్రమ లేదా మరో ప్రభుత్వం ఓ ఒప్పందం చేసుకొంటే, తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ఒప్పందాన్ని గౌరవించి దానికి కట్టుబడి ఉంటేనే ఆ దేశం లేదా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం మారినప్పుడల్లా ఒప్పంద పత్రాలు చించిపడేసి మళ్ళీ కొత్తవి రాసుకొందామంటే, ఏ సంస్థ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడదు.

టిడిపి హయాంలో ఒప్పందాలు చేసుకొని, వివిద దశలలో ఉన్న అటువంటి ప్రాజెక్టులు ఎన్నో వైసీపీ ధాటికి తట్టుకోలేక దణ్ణం పెట్టి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అటువంటి వాటిలో యూఏఈకి చెందిన ప్రముఖ రీటైల్ కంపెనీ లులూ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒకటి.

Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్‌: హ్యాండ్సప్

టిడిపి హయాంలో ఆ సంస్థకు విశాఖలో సముద్ర తీరంలో రూ.2,200 కోట్ల పెట్టుబడితో హైపర్ మార్కెట్‌, కన్వెషన్ సెంటర్ నిర్మించేందుకు ఒప్పందం చేసుకొంది. టిడిపి ప్రభుత్వం ఆ సంస్థకు 13 ఎకరాల స్థలాన్ని ఏడాదికి రూ.7.9 కోట్లు అద్దె చొప్పున లీజుకి ఇస్తూ ఒప్పందం చేసుకొంది.

ఆ సంస్థ విశాఖలో నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు సిద్దపడుతున్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి లులూ గ్రూప్ కష్టాలు మోయలయిపోయాయి. ఆ సంస్థ చెల్లించే అద్దె చాలా తక్కువంటూ వైసీపీ ప్రభుత్వం మెలిక పెట్టింది. ఆ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోగా, ఆ స్థలాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో విసుగెత్తిపోయిన ఆ సంస్థ, విశాఖ నుంచి వేరే రాష్ట్రానికి తరలిపోయేందుకు సిద్దపడింది.

Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.

ఈ విషయం తెలుసుకొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే స్వయంగా ఆ సంస్థ యాజమాన్యంతో మాట్లాడి కోయంబత్తూరులో నడిబొడ్డున స్థలం కేటాయించారు. దాంతో లులూ గ్రూప్ అక్కడికి తరలిపోయి రూ.3,000 కోట్ల పెట్టుబడితో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద హైపర్ మార్కెట్‌ నిర్మించింది. దానిలో 3,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. జూన్ 16వ తేదీన లులూగ్రూప్ ఛైర్మన్‌ యూసఫ్ అలీ దీనిని ప్రారంభించారు.

లులూ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, అది స్థానికంగా పండే కూరగాయలు, పళ్ళు, స్థానికంగా తయారయ్యే వివిద ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చి కొనుగోలు చేసి తమ హైపర్ మార్కెట్లో అమ్ముతుంటుంది.

Also Read – అందరి చూపు, నాని HIT వైపే

అంటే కోయంబత్తూరు, చుట్టుపక్కల రైతులు, పాడి రైతులు, దుస్తులు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, అలంకరణ, గృహోపకరణాలు వగైరా తయారు చేసే కుటీర పరిశ్రమలకి కూడా ఉపాధి, ఆదాయం లభిస్తుందన్నమాట.

అమరావతి కట్టకపోతే పాయే… కనీసం ఆనాడు టిడిపి తీసుకువచ్చిన అటువంటి సంస్థలను కాపాడుకొని ఉండి ఉంటే రాష్ట్రానికి ఆదాయం, యువతకు ఉద్యోగాలు, చుట్టుపక్కల ప్రాంతాలవారికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి కదా? అటువంటి మంచి సంస్థ ఏపీ చేజార్చుకొని మళ్ళీ వందల కోట్లు ఖర్చు చేసి విశాఖలో పెట్టుబడులు పెట్టండని కోరుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ నిర్వహించడం విడ్డూరంగా లేదూ?