రంగుల ప్రపంచంలో అసలు “రం(కు)గు” రివీల్ చేసిన మాధవి!

Maadhavi Latha On Tollywood Industryరంగుల ప్రపంచం అసలు “రంగు” బయటపడుతోంది. ఇంకో విధంగా చెప్పాలంటే “రంకు” బయటపడుతోందని చెప్పవచ్చు. మలయాళ సినీ పరిశ్రమ నుండి భావన ఇచ్చిన ఉత్సాహమో లేక భరించి భరించి విరక్తి చెంది ఉన్నారో గానీ, ఇప్పటివరకు వెండితెరపై క్యూట్ క్యూట్ గా కనిపించిన వాళ్ళంతా, తమకు జరిగిన అనుభవాలను చెప్తుంటే…. నోరెళ్ళబెట్టడం సామాన్య ప్రేక్షకుల వంతవుతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘నచ్చావులే’ ఫేం మాధవిలత చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి.

తనను “ఆ దిశగా” రమ్మన్నవారు నా జీవితంలో ఇంతమందిని చూశానని, తన వెంట్రుకలను చూపించిన మాధవిలత, తన జీవితంలో జరిగిన ఘటనలను తలచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. అంతేకాదు, తాము నోరు విప్పి నిజాలు మాట్లాడితే, చాలామంది కాపురాలు కూలిపోతాయో కూడా లెక్కలేదని, ఇండస్ట్రీలోని పోకడలను బట్టబయలు చేసారు. ఒకడు నా క్లోజ్ ఫ్రెండ్ గా ఉంటావా అంటాడు… మరొకడు కో-ఆపరేట్ చేయవా అంటాడు… అవసరమైన చోట కో-ఆపరేట్ చేయకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవని తనకు ఎంతోమంది చెప్పారని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పింది.

ADVERTISEMENT

“ఇక్కడ టాలెంట్ ఎవడికి కావాలి, ఇది నా వ్యక్తిగత అనుభవం, అలాగే చాలామంది జీవిత అనుభవం కూడా… ఇది నాకు కూడా తెలుసు, పుస్తకం మూసి ఉన్నంత వరకే రహస్యం, ఓపెన్ చేస్తే ఇంతేనా అనిపిస్తుందని” చెప్పింది. ఇక, తన జీవితంలో మరిచిపోలేని వ్యక్తి ఒకడు ఉన్నాడని, హీరోయిన్ కాక ముందు నుండి ఇప్పటివరకు టార్చర్ చేస్తూనే ఉంటున్నాడని, తానూ ఎదురు తిరిగితే నీ వీక్ నెస్ మీద కొడతానని చెప్పి, వారం రోజుల తర్వాత అమ్మ నుండి ఫోన్ వచ్చిందని, తనను పెంచి ఇంతవారిని చేసిన కన్నతండ్రిని… అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది మాధవిలత.

అయితే ఇదంతా జస్ట్ శాంపిల్ లో భాగంగా విడుదల చేసిన సంగతులు మాత్రమే… ఇంకొన్ని సెన్సేషన్ సంగతులు మరికొద్ది రోజుల్లో… బయటపడతాయి.

ADVERTISEMENT
Latest Stories