ట్విట్టర్ వేదికగా పవన్ చేస్తోన్న ట్వీట్లు హాట్ టాపిక్ అవుతుండగా, వీటికి కొందరు హీరోలు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా మంచు విష్ణు కూడా ఏపీకి దక్కాల్సిన స్పెషల్ స్టేటస్ కు అనుకూలంగా కామెంట్స్ చేసారు. “లక్కున్నోడు” సినిమా విడుదల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న విష్ణు… శాంతియుత పోరాటం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందన్న సంగతిని జల్లికట్టు ఆందోళన గుర్తు చేస్తోందని, దానిని ఆదర్శంగా తీసుకుని మనమందరం ఏపీకి ‘ప్రత్యేక హోదా’ తెచ్చేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.
‘ఈ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని, అయినప్పటికీ ఉత్తరాదిన మన వారికి సరైన గుర్తింపు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన విష్ణు, అలాంటప్పుడు ఒకే దేశంగా ఉండాల్సిన అవసరం ఉందా? దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది అంటూ రెండు భాగాలుగా విడగొట్టడమే మంచిదని’ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. ఇటీవల పవన్ కూడా ఉత్తరాది – దక్షిణాది విషయంలో కేంద్రం చూపుతున్న వలపత్యాన్ని ఎత్తిచూపుతూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.
#M9NewsWin1000 contest every Wednesday – Answer our Question and win Rs 1000 Paytm Gift vouchers #contest2 pic.twitter.com/Yx6Z5Wql50
— M9News (@M9News) January 23, 2017



