మహాకూటమిలో సీట్ల లొల్లి

Mahakutami Seat sharing issue in telanganaకేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడినా సీట్ల పంపకంలో తకరారు అన్ని పక్షాలను ఇబ్బంది పెడుతూనే ఉంది. కాంగ్రెస్ నుండి తెలుగు దేశం పార్టీ 28 సీట్లు కోరుతున్నట్టుగా సమాచారం. ఈ ప్రకారంగా రెండు రకాల జాబితాలు తయారు చేసి పంపినట్టు సమాచారం. దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ADVERTISEMENT

[m9ad]

అయితే టీడీపీ అడిగిన స్థానాలన్నింటినీ ఇవ్వలేమని, తమ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు కూడా అవకాశం కల్పించాల్సి ఉన్నందున 13–15 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. అదే సమయంలో తెలంగాణ జనసమితి పెట్టిన కండిషన్ ఆసక్తికరంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి కూటమిలో ఎన్ని సీట్లు ఇస్తారో,అంతకన్నా రెండు సీట్లు అదనంగా ఇవ్వాలన్నది టిజెఎస్ షరతు అని వార్తలు సూచిస్తున్నాయి.

ఈ విషయంలో టిజెఎస్ పట్టుదలగా కూడా ఉందట. తాము పోటీ చేయాలనుకుంటున్న 35 నియోజకవర్గాల జాబితాను మహా కూటమి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకత్వానికి ఇచ్చారని అంటున్నారు. అభ్యర్థుల పేర్లను మాత్రం చెప్పలేదని ప్రచారం జరుగుతోంది. అయితే టీజేఎస్‌ తరఫున అభ్యర్థులు బలంగా లేరని.. కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

పైగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలనే టీజేఎస్‌ అడుగుతోందట. ఈ రెండు పార్టీలకు ఇన్ని సీట్లు ఇచ్చేస్తే ఇక తమకు మిగిలేది ఏంటి అని కాంగ్రెస్ ఆందోళన చెందుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని మహాకూటమి అంటున్నామే గానీ ఇన్ని సీట్లు ఇచ్చేస్తే మొదటికే మోసం రావొచ్చని వాళ్ళు ఆందోళన చెందుతున్నారట.

ADVERTISEMENT
Latest Stories