‘ఆన్ లైన్’ ప్రపంచాన్ని ఊపేస్తోన్న ‘మహేష్’ బ్రాండ్!

yupp-tv-maheshమహేష్ బాబు… ఇదొక పేరు కాదు… ఇట్స్ ఎ బ్రాండ్… అన్న టాక్ ఇప్పటికే కార్పొరేట్ రంగంలో పాతుకుపోయింది. రెండు అంకెల సంఖ్యలో మహేష్ బాబు అన్న పేరు ‘బ్రాండ్ అంబాసిడర్’గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మామూలు మార్కెట్ కు మాత్రమే పరిమితమైన మహేష్ పేరు, ప్రస్తుతం ఆన్ లైన్ ప్రపంచాన్ని కూడా ఊపేసే దిశగా సాగుతోంది.

ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆన్ లైన్ బస్సుల బుకింగ్స్ వెబ్ సైట్ ‘అబిబస్.కాం’ కోసం మహేష్ బాబుపై ఓ యాడ్ చిత్రీకరణ జరుపుకోగా, తాజాగా మరో ఆన్ లైన్ సంస్థ మహేష్ తో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆన్ లైన్ లో టీవీ ఛానల్స్ ను, సినిమాలను అందుబాటులోకి తీసుకువచ్చే ‘యప్పీటీవీ’ మహేష్ తో అగ్రిమెంట్స్ చేసుకుని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories