మహేష్… ఫ్యాన్స్ కు కూడా బోర్ కొట్టేస్తుందేమో..!

Mahesh Babu 6th place most desirable man 2017జాతీయ స్థాయిలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయాన్నైనా ప్రకటించడం… అందులో టాలీవుడ్ నుండి ప్రిన్స్ మహేష్ బాబు తొలి స్థానం దక్కించుకోవడం… అనేది గత కొన్ని సంవత్సరాలుగా పరిపాటిగా మారిపోయింది. తాజాగా 2016 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ ది ఇయర్ లో టాప్ 7 స్థానాన్ని ప్రిన్స్ కైవసం చేసుకున్నారు.

2015వ సంవత్సరంలో 6వ స్థానంలో నిలిచిన ప్రిన్స్, 2016కు ఒక స్థానాన్ని కిందకి జరిగారు. ఈ ఏడాదిలో విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ మహేష్ కు నిరాశజనమైన ఫలితాన్ని అందించినప్పటికీ, అది ప్రజల ఆదరణ దృష్టిలో పెద్దగా వ్యత్యాసం చూపించలేదన్న విషయం స్పష్టమైంది. ప్రతి ఏడాది ఈ జాబితా ప్రకటించడం… అందులో మహేష్ పేరు టాప్ లో ఉండడం… బహుశా మున్ముందు ఫ్యాన్స్ కు కూడా బోర్ కొట్టేస్తుందేమో..!

ADVERTISEMENT

ఇక నెంబర్ 1 స్థానంలో రోహిత్ ఖండేల్వాల్ ఉండగా, విరాట్ కోహ్లి 2, హృతిక్ రోషన్ 3, రన్వీర్ సింగ్ 4, ఫవాద్ ఖాన్ 5, సిద్ధార్ద్ మల్హోత్రా 6 స్థానాలలో మహేష్ పైన ఉన్నారు. జితేష్ ఠాకూర్ 8, దోసంజ్ 9, షాహిద్ కపూర్ 10 స్థానాలను దక్కించుకున్నారు. ఇక ఇతర ప్రముఖుల ధోని 18, ప్రభాస్ 22, రానా 24, ధనుష్ 26 టాప్ 50లో చోటు దక్కించుకున్న వారి జాబితాలో ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories