బుర్రిపాలెం ‘అప్ డేట్స్’ వచ్చాయి… అదిరాయబ్బాయ్..!

Mahesh Babu Adopted Burrepalem Village Progress Updatesటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తతకు తీసుకున్నారు అనేది పాత మాట. ఆ గ్రామం శరవేగంగా అభివృద్ధికి నోచుకుంటోంది అనేది కొత్త మాట. తాజాగా బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన పలు ఫోటోలను ప్రిన్స్ మహేష్ బాబు తన ఫేస్ బుక్ ఖాతాలో అప్ డేట్ చేసారు. సిమెంట్ రోడ్డులతో బుర్రిపాలెం కళకళలాడుతుండగా, డ్రైనేజ్ తదితర కార్యక్రమాలు కూడా జరిగినట్లు ఫోటోలలో స్పష్టమైంది.

ADVERTISEMENT

ఈ అభివృద్ధి కార్యక్రమాలు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నిధుల నుండి జరిగాయని, అందుకు సహకరించిన ఎంపీ గల్లా జయదేవ్ కు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రిన్స్. ఎప్పటికప్పుడు బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన పనులను ప్రిన్స్ బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. అభివృద్ధి ప్రణాళికలు చేపట్టడం ఆలస్యమైంది గానీ, ఒక్కసారి ప్రారంభమైన తర్వాత పనులన్నీ శరవేగంగా జరుగుతుండడం ‘ప్రిన్స్ అండ్ కో’ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఓ పక్కన ఇలా పైకి కనపడే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామస్తులకు, పిల్లలకు ముఖ్యమైన వైద్య సదుపాయాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుండడం విశేషం. ఇప్పటికే బుర్రిపాలెం నుండి ఎవరూ వెళ్ళినా, ‘ఆంధ్రా హాస్పిటల్’ యాజమాన్యం ఉచితంగా వైద్య సేవలు అందిస్తుండగా, గాంధీ జయంతి వంటి కొన్ని ప్రముఖ రోజులలో, హాస్పిటల్ పర్యవేక్షణలో గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపెన్లు జరుగుతున్నాయి. అలాగే సిద్ధార్ధ కాలేజీకి చెందిన పలువురు విద్యార్ధులు గ్రామంలో స్వచ్చంద వైద్య సేవలు అందిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories