సమంత చూసినా పండగ చేసుకునేలా ఉంది!

Mahesh Babu Daughter Sitara Telling Samantha Brahmotsavam Dialoguesప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి నెటిజన్లకు తెలిసిన విషయమే. క్యూట్ క్యూట్ ఫోటోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేసే సితార, తన తండ్రికి సంబంధించిన సినిమా పాటలకు డ్యాన్స్ లు వేసి కూడా ఆకట్టుకుంది. ‘టాలెంట్’కు పవర్ హౌస్ లా ఉన్న సితార, తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో సమంత చెప్పిన ఓ డైలాగ్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

‘బ్రహ్మోత్సవం’ సినిమా ట్రైలర్ నుండి పాపులర్ అయిన ‘ఏడు తరలా… వెతికితే దొరకనంత మందా… తెలిస్తే వదులుకోలేనంత మందా…’ డైలాగ్ చిన్నారి సితార చెప్తుంటే ఎంత క్యూట్ క్యూట్ గా ఉందొ అంటూ నెటిజన్లు సదరు వీడియోను షేర్ చేసుకుంటున్నారు. నిజానికి ఆ సినిమాలో సమంత చెప్పిన దాని కంటే సితార చెప్పిందే అదిరిపోయింది అంటున్నారు ప్రిన్స్ అభిమానులు.

ADVERTISEMENT

సమంతకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి స్వరం కంటే, సమంత ఎక్స్ ప్రెషన్స్ కంటే సితార స్వరం, హావభావాలు ముద్దొచ్చే విధంగా ఉండడంతో ఈ 7 సెకన్ల వీడియోను సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. సమంతకు – సితారకు మధ్య మంచి అవగాహన ఉందన్న విషయం ‘బ్రహ్మోత్సవం’ ఆడియో వేడుక స్పష్టం చేయడంతో, బహుశా ఈ వీడియోను సమంత చూసినా షేర్ చేసుకునేదేమో అనేటంతగా సితార చిలక పలుకులు పలికింది.

ADVERTISEMENT
Latest Stories