మురుగదాస్ – మహేష్ సినిమా ఫస్ట్ లుక్ విశేషాలు!

Mahesh Babu, Mahesh Babu Murugadoss First Look, Mahesh Babu Director Murugadoss First Look, Mahesh Babu Murugadoss Movie First Look, Super Star Mahesh Babu Murugadoss First Look, Mahesh Babu AR Murugadoss First Lookటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో మిడ్ నైట్ వేళల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా, ఈ నెల 22వ తేదీ నుండి చెన్నైలో భారీ షెడ్యూల్ కోసం పయనం కానుంది. ఇటీవల హైదరాబాద్ లో రాత్రి వేళల్లో చిత్రీకరించిన ఫైటింగ్ సన్నివేశాలు బాగా వచ్చాయనే టాక్ సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT

ముఖ్యంగా సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ కానుందని తెలుస్తోంది. సామాజిక అంశాలను మేళవించి సినిమాలను రూపొందించే మురుగదాస్, ఈ సినిమా ఇతివృత్తం కూడా ఓ సామాజిక కోణం చుట్టే తిరిగే విధంగా రూపొందించినట్లుగా తెలుస్తోంది. మహేష్ – మురుగదాస్ క్రేజీ కాంభినేషన్ రీత్యా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ప్రిన్స్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ముగిసిన ప్రిన్స్ పుట్టినరోజు నాడు విడుదల అవుతుందని భావించినప్పటికీ, అది కార్యరూపం దాల్చుకోలేదు. దీంతో ప్రిన్స్ మళ్ళీ ఎప్పుడు దర్శనమిస్తాడోనని ఆసక్తిగా ఉన్న అభిమానులకు దసరా పండగ సమాధానంగా లభిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను, టీజర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories