సోషల్ మీడియాలో ఖాతాలు ఉన్న మాటకే కాని, ఎప్పుడో సినిమాల రిలీజ్ టైంలో తప్ప పెద్దగా స్పందించని మహేష్ బాబు సంగతులను, సతీమణి నమ్రత ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుపుతుంటుంది. పిల్లలు గౌతమ్, సితారలతో వెళ్ళిన ఫ్యామిలీ ట్రిప్ లు తదితర ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ప్రిన్స్ ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లో ఉంచుతుంది.
అలాంటి నమ్రత, తాజాగా మాత్రం ఓ వెరైటీ ఫోటోను పోస్ట్ చేసింది. గౌతమ్, సితారలు కలిసి మహేష్ చేయి పట్టుకుని తీసుకువెళ్తున్న ఫోటోను బ్యాక్ యాంగిల్ నుండి తీసి నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలో మహేష్ తో సహా ఏ ఒక్కరి ముఖాలు కూడా స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో మా మహేష్ బాబును ఇలా చూపించారేంటి మేడం అంటూ నమ్రతను అడగడం అభిమానుల వంతవుతోంది.
అయితే ఇందులో ఏం చూసారో ఏమో గానీ, హీరోయిన్లు సమంత, కైరా అద్వానీ వంటి ప్రముఖులు లైక్స్ కొట్టేసారు. బహుశా క్రిస్మస్ వేడుకలకు గౌతమ్ – సితారలు కలిసి మహేష్ బాబును తీసుకువెళ్తున్నట్లుగా ఈ ఫోటోలో భావం కనపడుతుందేమో… అందుకే తక్కువ టైంలోనే లైక్స్ బాగా వచ్చి పడుతున్నాయి.



